మరో సినీ తారకు కరోనావైరస్.. వెంటనే గృహ నిర్బంధంలోకి..
అమెరికా నటి, జుమాంజీ ఫేమ్ లారా బెల్ బండీ కరోనావైరస్ బారిన పడ్డారు. తాను కొవిడ్19 పరీక్షల్లో పాజిటివ్ అని తేలిందని బుధవారం తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. నాకు కరోనా సోకింది అంటూ ధృవీకరించారు. ఈ మేరకు ఓ వీడియోను రిలీజ్ చేసింది.
నా అభిమానులు, స్నేహితులకు తెలియజేసేదేమిటంటే.. కొవిడ్19 నిర్ధారణ పరీక్షల్లో నాకు పాజిటివ్ అని వచ్చింది. నాకు కరోనా సోకింది. భయపడాల్సిన అవసరం లేదు. పరిస్థితులంతా అదుపులోనే ఉన్నాయి. పుష్టికరమైన ఆహారం తీసుకొంటున్నాను. వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాను. ప్రస్తుతం మూలికలు తీసుకొంటున్నాను అని లారా బెల్ తెలిపారు.

గత కొద్దిరోజులుగా దగ్గు, తలనొప్పి, ఛాతిలో ఇబ్బంది, శ్వాస సంబంధిత సమస్యలు మైనర్‌గా కనిపించాయి. అయితే తనకు ఏ పరిస్థితుల్లో కరోనా సోకిందనే విషయంపై అవగాహన లేదు. స్వీయ గృహనిర్బంధంలో ఉన్నాను అని వీడియోలో పేర్కొన్నది. కాబట్టి ప్రతీ ఒక్కరు జాగ్రత్తగా ఉండండి. ఇంటి నుంచి బయటకు రాకండి. గృహ నిర్బంధంలో ఉండండి అంటూ సలహా ఇచ్చారు.
ఇప్పటికే హాలీవుడ్‌లో ఇద్రిస్ ఎల్బా, ఆండీ కెహెన్, టామ్ హాంక్స్, రిటా విల్సన్ లాంటి సినీ ప్రముఖులు కరోనావైరస్ బారిన పడిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











