ప్రముఖ దర్శకుడితో హీరోయిన్‌కు చేదు అనుభవం.. నా గదిలోకి వస్తావా? బాత్‌రూమ్‌లో వెంటపడి..

లైంగిక వేధింపులు, మానభంగం కేసులో హాలీవుడ్ ఫిల్మ్ మేకర్ హర్వే వెయిన్‌స్టెయిన్ జైలుశిక్ష అనుభవిస్తున్నప్పటికీ.. అతడిపై స్టార్ హీరోయిన్ల ఆరోపణలు మాత్రం తగ్గడం లేదు. తాజాగా హలీవుడ్ నటి ప్యారిస్ హిల్టన్ సంచలన ఆరోపణలు చేసింది. 2000 సంవత్సరంలో జరిగిన కేన్స్ ఫిలిం ఫెస్టివల్ సందర్భంగా హార్వే నుంచి ఎదురైన చేదు సంఘటనను పంచుకొని ఆవేదన వ్యక్తం చేసింది. ప్యారిస్ హిల్టన్ వెల్లడించిన దారుణమైన సంఘటన వివరాల్లోకి వెళితే..

19 ఏళ్ల వయసులో అలాంటి పరిచయం

19 ఏళ్ల వయసులో అలాంటి పరిచయం

కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌కు నేను 2000 సంవత్సరంలో హాజరయ్యాను. అప్పుడు నా వయసు 19 సంవత్సరాలు. నేను హీరోయిన్‌గా, నటిగా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న సమయం అది. ఎయిడ్స్ బాధితుల సహాయ నిధి ఏర్పాటు కోసం ఫిలిం మేకర్ హార్వే వెయిన్‌స్టెయిన్ ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో హార్వే వెయిన్‌స్టెయిన్‌తో పరిచయం జరిగింది అని ప్యారిస్ హిల్టన్ వెల్లడించింది.

యాక్టర్ కావాలని ఉందా? అంటూ

యాక్టర్ కావాలని ఉందా? అంటూ

హార్వే ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో నా స్నేహితురాలితో నేను వెళ్లి లంచ్ చేస్తున్నాను. ఆ సమయంలో హర్వే వచ్చి.. నీవు యాక్టర్ కావాలని అనుకొంటున్నావా? అని నన్ను అడిగాడు. దాంతో నేను అవును. నాకు సినిమాలో నటించాలని ఉందని బదులు చెప్పాను. అయితే ఆ సమయంలో నా పట్ల చూపించిన చొరవను చూసి హర్వే గొప్పవాడు. ఇతరులకు సహాయం చేస్తాడనే మంచి ఫీలింగ్ కలిగింది అని ప్యారిస్ హిల్టన్ చెప్పింది.

నా రూమ్‌కి వస్తావా? అంటూ

నా రూమ్‌కి వస్తావా? అంటూ

హర్వేతో చాలా సేపు మాట్లాడుతూ ఉండిపోయాను. ఆ తర్వాత కొద్ది సేపటికి నా రూమ్‌కు వెళ్దామని పద అన్నాడు. నా రూమ్‌లో చాలా స్క్రిప్ట్స్ ఉన్నాయి. వాటిని చదివి నీ అభిప్రాయం చెప్పు అంటూ నా వెంటపడ్డాడు. అయితే ఆయన గదికి వెళ్లడానికి నిరాకరించాను. ఆయన మాటలు, చేతల్లో ఏదో చెడు కనిపించడంతో నేను వెళ్లకూడదని నిర్ణయించుకొన్నాను అని ప్యారిస్ హిల్టన్ వెల్లడించింది.

డిన్నర్ పార్టీలో నన్ను వెంటాడి..

డిన్నర్ పార్టీలో నన్ను వెంటాడి..

తన కోరికకు అభ్యంతరం చెప్పడంతో హార్వే వెయిన్‌స్టెయిన్ హర్ట్ అయ్యాడు. ఆ రోజు డిన్నర్ పార్టీ సందర్భంగా నాపై దురుసుగా ప్రవర్తించాడు. ఆ వేడుకలో నన్ను వెంటాడటం మొదలుపెట్టాడు. నేను బాత్రూంకు వెళితే.. నా వెంటపడ్డాడు. నేను వాష్‌రూమ్‌లో దూరితే.. తలుపు తీయమని అరిచాడు. బాత్రూం తలుపులపై దబదబా కొట్టడం చేశాడు. దాంతో నేను చాలా భయపడిపోయాను అని ప్యారిస్ ఆ రోజు ఘటనను తలచుకొంది.

వాష్‌రూమ్‌లో దూరితే.. వెంటపడ్డాడు..

వాష్‌రూమ్‌లో దూరితే.. వెంటపడ్డాడు..

అయితే వాష్‌రూమ్‌లో హార్వే అరుస్తూ ఉంటే.. సెక్యూరిటీ సిబ్బంది వచ్చారు. తాగిన మైకంలో వాష్ రూమ్ తలుపులపై బలంగా బాదుతుంటే.. ఆయనను అక్కడి నుంచి బలవంతంగా తీసుకెళ్లారు. ఇది నేను ఇచ్చిన పార్టీ.. నన్ను మీరు లాగేందుకు ప్రయత్నిస్తారా? అంటూ వారిపై అరిచాడు. ఈ విషయం అందరికి తెలిసిందే. కానీ హాలీవుడ్‌లో హార్వే పవర్‌ఫుల్ కాబట్టి ఆయనపై ఎవరూ ఫిర్యాదు చేయలేదు అని ప్యారిస్ హిల్టన్ వెల్లడించింది.

ప్యారిస్ హిల్టన్ ఆరోపణలు అసత్యాలు

ప్యారిస్ హిల్టన్ ఆరోపణలు అసత్యాలు

అయితే అమెరికన్ మీడియా కంపెనీకి చెందిన వెరైటీ మ్యాగజైన్‌కు ఇచ్చిన ప్యారిస్ హిల్టన్ ఇంటర్వ్యూ ప్రస్తుతం వైరల్ అవుతున్నది. ఈ క్రమంలో ప్యారిస్ హిల్టన్ ఆరోపణలపై హార్వే అధికార ప్రతినిధిని సంప్రదించగా.. ఆమె ఆరోపణలను ఖండించారు. ఆ సమయంలో అలాంటి సంఘటన జరగలేదు. ఆమె చెప్పిన దాంట్లో ఎలాంటి నిజాలు లేవు అని అన్నారు.

హార్వేకు 23 ఏళ్ల జైలుశిక్ష

హార్వేకు 23 ఏళ్ల జైలుశిక్ష

ఇదిలా ఉండగా, హాలీవుడ్‌కు చెందిన పలువురు హీరోయిన్లు తమపై అత్యాచారం చేశారనే కేసు నమోదు చేయడంతో 2020 సంవత్సరంలో కోర్టు హార్వే వెయిన్‌స్టెయిన్‌ను దోషిగా నిర్ధారించింది. లైంగిక ఆరోపణలు, మానభంగం కేసులో ఆయనకు 23 ఏళ్ల జైలు శిక్షను విధించింది. ప్రస్తుతం హార్వే జైలు శిక్షను అనుభవిస్తున్న సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X