16 ఏళ్ల వయసులోనే ఆ డైరెక్టర్.. డబ్బు కావాలి కాబట్టి తప్పలేదు! సినీ నటి షాకింగ్ కామెంట్స్
సినీ ఇండస్ట్రీలో మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయని ఎందరో నటీమణులు ఓపెన్ అవుతున్నారు. మీటు ఉద్యమం ప్రభావంతో చాలామంది నటీమణులు తమ తమ అనుభవాలను తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవలే హాలీవుడ్ నటి రీస్ విదర్‌స్పూన్ తనపై జరిగిన లైంగిక వేధింపుల గురించి చెప్పింది. వివరాల్లోకి పోతే..

ఓ దర్శకుడు లైంగికంగా.. అప్పట్లో కల్చర్
తనను 16 ఏళ్ల వయసులోనే ఓ దర్శకుడు లైంగికంగా వేధించాడని చెప్పింది. ఆ విషయం తెలిసిన వారికి చెబితే మౌనంగా ఉండమనేవారని, అప్పట్లో కల్చర్ అలాగే ఉండేదని ఈ హాలీవుడ్ నటి చెప్పుకొచ్చింది. కానీ ఈ మధ్యకాలంలో మీటూ ఉద్యమం ప్రభావంతో ఎందరో ఆడవాళ్లు బయటికి వచ్చి తమకు జరిగిన అన్యాయాలను బయటపెట్టడం చూసి షాకయ్యానని ఆమె తెలిపింది.

కెరీర్‌లో చాలా సార్లు జరిగింది.. కానీ
తాను 16 ఏళ్ల వయసులో ఓ దర్శకుడి లైంగిక వేధింపులకు బలయ్యానని రీస్ విదర్‌స్పూన్ పేర్కొంది. చిన్న వయసులోనే సినీ పరిశ్రమలోకి వచ్చి ఎన్నో సమస్యలు ఎదుర్కోవలసి వచ్చిందని తెలిపింది. తన కెరీర్‌లో చాలా సార్లు లైంగిక వేధింపులను ఎదుర్కొన్నానని, ఆ సమయంలో ఈ విషయాలను బయటపెట్టనందుకు తాను ఇప్పటికీ చింతిస్తున్నానని చెప్పింది.

23 ఏళ్ల వయసులో.. సెక్సీ దుస్తులు
ఇక 23 ఏళ్ల వయసులో ఓ ఆడిషన్ కంపెనీ ఓనర్ తనను సెక్సీగా కనిపించే దుస్తుల్లో రమ్మన్నాడని రీస్ విదర్‌స్పూన్ చెప్పుకొచ్చింది. అప్పటికే తాను ‘ఎలెక్షన్' అనే సినిమాలో నటించానని, అయితే వాళ్ళ సినిమాలో ఛాన్స్ కావాలంటే ఖచ్చితంగా సెక్సీగా దుస్తులు వేసుకుని రావాలని చెప్పారని ఆమె తెలిపింది.

అవే ఘటనలు ఇప్పుడున్న హీరోయిన్లకు ఎదురైతే
అవే ఘటనలు ఇప్పుడున్న హీరోయిన్లకు ఎదురైతే రచ్చ చేసేవారని చెప్పింది. కానీ అప్పట్లో తాను ఏమీ చేయలేని పరిస్థితి అని, అప్పటికే తాను ఓ బిడ్డకు తల్లిని.. సో ఇంటిని చూసుకోవడానికి డబ్బు కావాలని కాబట్టి తప్పలేదని చెప్పింది నటి రీస్ విదర్‌స్పూన్. అప్పట్లో తాను ఎదుర్కొన్న ఈ సంఘటనలు ఇప్పుడు తలుచుకుంటే నవ్వు వస్తోందని ఆమె చెప్పింది. అయితే నాలాంటి బాధితులు ఇంకా ఎంతోమంది ఉన్నారని తెలిసి అవాక్కయ్యానని ఆమె పేర్కొంది.


Click it and Unblock the Notifications











