Don't Miss!
- News YS Sharmila: వైఎస్ షర్మిలకు ఈసీ షాక్- వివేకా కేసులో వ్యాఖ్యలకు నోటీసులు..!
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Sports SRH playing XI: అతనిపై వేటు..ఢిల్లీతో ఆడే తుదిజట్టు ఇదే
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
కమెడియన్‌ను పెళ్లాడిన స్టార్ హీరోయిన్.. రెండేళ్లు డేటింగ్ చేసి సీక్రెట్‌గా మూడో పెళ్లి
ప్రముఖ హాలీవుడ్ నటి స్కార్లెట్ జాన్సన్ అభిమానులకు, సినీ ప్రముఖులకు షాకిచ్చచింది. ఎవరికీ సమాచారం ఇవ్వకుండా.. సీక్రెట్‌గా కమెడియన్ కోలిన్ జస్ట్‌ను వివాహం ఆడినట్టు అమెరికాకు చెందిన ప్రముఖ వార్త పత్రిక వెల్లడించింది. స్కార్లెట్ జాన్సన్‌కు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇదే అంటూ తమ ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో..
లాక్డౌన్లో సీక్రెట్‌గా
స్కార్లెట్ జాన్సన్ అతికొద్ది మంది తన స్నేహితులు, సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య కొలిన్ జోస్ట్ను వివాహం చేసుకొన్నారు. వివాహం సందర్భంగా లాక్డౌన్ నిబంధనలు పాటించారు. కరోనా పరిస్థితుల కారణంగా ఎవరికీ సమాచారం అందించలేదు అంటూ వార్త పత్రిక తమ పోస్టులో పేర్కొన్నది.
కోవిడ్ కారణంగా సన్నిహితుల మధ్య
స్కార్లెట్ జాన్సన్ పెళ్లి వార్తను బట్టబయలు చేసిన ప్రముఖ పత్రిక ఆమెకు వివాహ శుభాకాంక్షలు తెలిపింది. అంతేకాకుండా ఫ్యాన్స్‌ను, శ్రేయోభిలాషులను శుభాకాంక్షలు అందించమని కోరింది. కోవిడ్ పరిస్థితుల కారణంగా స్కార్లెట్ జాన్సన్ వివాహం నిరాడంబరంగా జరిగింది అని తమ పోస్టులో వెల్లడించారు.
స్కార్లెట్ జాన్సన్ తొలి, రెండో వివాహం
ఇక స్కార్లెట్ జాన్సన్ మొదటి వివాహం విషయానికి వస్తే.. కెనడాకు చెందిన నటుడు ర్యాన్ రేనాల్డ్ను 2008 పెళ్లి చేసుకొన్నది. మూడేళ్ల వివాహం తర్వాత ర్యాన్ నుంచి విడాకులు తీసుకొన్నది. ఆ తర్వాత ఫ్రెంచ్ జర్నలిస్టు రొమెయిన్ డారియాక్‌ను 2014లో వివాహం చేసుకొన్నారు. అయితే ఈ పెళ్లి కూడా ఎక్కువ కాలం నిలువలేదు. 2017లో వారిద్దరూ కూడా విడిపోయారు.
కమెడియన్‌తో ఎంగేజ్మెంట్, డేటింగ్
ఆ తర్వాత కొన్నాళ్లు ఒంటరిగానే ఉన్న స్కార్లెట్ జాన్సన్.. కోలిన్ జోస్ట్తో ప్రేమలో పడింది. ఆ తర్వాత 2019లో ఎంగేజ్మెంట్ చేసుకొన్ని రెండేళ్లు డేటింగ్ చేశారు. తాజాగా గుట్టు చప్పుడు కాకుండా వారిద్దరూ పెళ్లిచేసుకొని అందరికి షాకిచ్చారు.
Recommended Video
స్కార్లెట్ జాన్సన్ కెరీర్ ఇలా..
స్కార్లెట్ జాన్సన్ కెరీర్ విషయానికి వస్తే.. మార్వెల్ సూపర్ హీరో చిత్రాలతో మంచి గుర్తింపు పొందారు. ఇటీవల విడుదలై సంచలన విజయం సాధించిన అవెంజర్స్‌లో నటించింది. త్వరలో విడుదల కానున్న మార్వెల్ సూపర్ హీరో చిత్రం బ్లాక్ విడోలో నటించింది. ఈ ఏడాది జోజో రాబిట్, మ్యారేజ్ స్టోరి చిత్రాల్లో ఉత్తమ నటనకు గాను రెండు ఆస్కార్ నామినేషన్లను సాధించింది.