హీరోయిన్‌ని కాల్చి చంపిన పోలీసులు.. ఇంతకన్నా విషాదం లేదు!
Recommended Video

ప్రముఖ హాలీవుడ్ నటి దుర్మరణం చెందింది. ఆమె మరణానికి గల కారణం అత్యంత విషాదాన్ని కలిగించే విధంగా ఉన్నాయి. అమెరికన్ డ్రామా సిరీస్ 'ఈఆర్' తో వెనెస్సా మెర్క్యూజ్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం మెర్క్యూజ్ వయసు 49 ఏళ్ళు. ఆమె కొంత కాలంగా మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఆమెకు ఓ ఆపరేషన్ కూడా జరిగిందట. ఇంతకీ ఆమె మరణం ఎలా సంభవించిందో ఇప్పుడు చూద్దాం.

మానసిక వ్యాధి
కొంత కాలంగా వెనెస్సా మెర్క్యూజ్ మానసిక సమస్యలతో బాధపడుతోందట. ఇటీవల సర్జరీ జరిగినా ఆమె పరిస్థితి అంతగా బాగోలేదని తెలుస్తోంది. హాలీవుడ్ నటిగా మెర్క్యూజ్ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

సామజిక కార్యక్రమం
ఆమె నివాసం ఉంటున్న ప్రాంతానికి పోలీసులు ఓ సామజిక కార్యక్రమం కోసం వెళ్లినట్లు తెలుస్తోంది. రోజులకు ఉచితంగా చికిత్స అందించే కార్యక్రమం. ఆ ప్రాంతానికి మెర్క్యూజ్ కూడా వచ్చింది. ఒక్కసారిగా ఆమె అధికారిపై తుపాకీ గురిపెట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

గంటన్నర సేపు
దాదాపు గంటన్నరసేపు పోలీసులు,మానసిక వైద్యుడు ఆమెతో మాట్లాడడానికి ప్రయత్నించారు. వైద్యం అందిస్తామని చెప్పారు . కానీ ఆమె ఆ మాటలు పట్టించుకోకుండా తుపాకీ గురిపెట్టింది. ఇక తప్పని పరిస్థితుల్లో పోలీసులు ఆమెని కాల్చి చంపారు.

తీరా చూస్తే
మెర్క్యూజ్ మరణించిన తరువాత ఆమెని పోలీసులు పరిశీలించగా మెర్క్యూజ్ వద్ద ఉన్నది బొమ్మ తుపాకీ లాంటిదని తేలింది. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మెర్క్యూజ్ మానసిక వ్యాధి కారణంగానే ఇలా ప్రవర్తిస్తోంది. ఇలా ఆమె మృతి చెందడం దురదృష్టకరమని అంటున్నారు.


Click it and Unblock the Notifications











