Jr NTRపై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్.. ఆ హీరో ఎవరు? అతని పేరేంటీ? అంటూ!

ఎన్నో ఏళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తన మార్క్ చూపిస్తూ దూసుకుపోతున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ కావడంతోపాటు గ్లోబల్ స్టార్ అయిపోయాడు. ఇందులో కొమురం భీమ్ పాత్రలో నటించి తారక్ నటనకు యావత్ ప్రపంచమే ఫిదా అయింది. నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డ్ రావడంతో తారక్ పేరు మరింత మారుమోగిపోయింది. అయితే తాజాగా ఎన్టీఆర్ పై హాలీవుడ్ డైరెక్టర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

రాజమౌళితో రౌద్రం.. రణం.. రుధిరం (RRR) సినిమాలో తన నటనతో గ్లోబల్ స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. దీంతో ఆయన తర్వాతి సినిమాపై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే ప్రముఖ దర్శకుడు కొరటాల శివతో NTR30 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే కాకుండా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోనూ ఓ సినిమాను చేయనున్నాడు.

Hollywood Director James Gunn Says He Wants Do With Film Jr NTR

ఇక కొరటాల శివతో మూవీ కంప్లీట్ అయిన తర్వాత హిందీ చిత్రం వార్ 2లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించనున్నాడు. ఇందులో బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ తో ఢీ కొట్టే పాత్రలో తారక్ కనిపించనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే RRR మూవీలోని నాటు నాటు పాట ఆస్కార్ వేడుకలకు అమెరికా వెళ్లినప్పుడు తారక్ ను హాలీవుడ్ చిత్రాల్లో నటిస్తారా అని అడిగారు. బట్ ఫర్ ఏ చేంజ్ ఎన్టీఆర్ తో సినిమా చేయాలని ఉందని హాలీవుడ్ దర్శకులు చెబుతున్నారు.

మార్వెల్ హిట్ చిత్రాల్లో "గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ" (Guardians of the Galaxy) ఒకటి. ఈ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు డైరెక్టర్ జేమ్స్ గన్. ఇప్పుడు ఆయన 'సూపర్ మ్యాన్: లెగసీ' తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు, ప్రమోషన్స్ లలో బిజీగా ఉన్న ఆయనకు తాజా ఇంటర్వ్యూలో ఓ ప్రశ్న ఎదురైంది. "ఒకవేళ ఎవరైనా భారతీయ నటులను గార్డియన్ ప్రపంచంలోకి తీసుకురావాలనుకుంటున్నారా? అనుకుంటే ఎవరు?" అని అడిగారు.

Hollywood Director James Gunn Says He Wants Do With Film Jr NTR

యాంకర్ అడిగిన ప్రశ్నకు జేమ్స్ గన్.. "RRR సినిమాలో సూపర్ హీరోగా కనిపించిన ఆ హీరో ఎవరు? అతని పేరు ఏంటీ? గతేడాది వచ్చిన అతిపెద్ద చిత్రాల్లో RRR ఒకటి. అందులో బోనులో నుంచి పులులతో పాటు వస్తాడు కదా. ఏదో ఒకరోజు అతనితో కలిసి పనిచేయాలని ఉంది. అతను చాలా అద్భుతంగా నటించాడు. అందులో చాలా కూల్ గా యాక్ట్ చేశాడు" అని చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X