వార్నర్ బ్రదర్స్ సంస్థే ఈ హత్యను చేసింది..!!
'క్లూలెస్' తార బ్రిటానీ ముర్ఫీ మరణానికి హాలీవుడ్ కారణమని, అందులోనూ వార్నర్ బ్రదర్స్ సంస్థ వారు సృష్టించిన పుకారు ఆమెను ఎంతగానో క్షభపెట్టాయని ఆమె భర్త సిమాన్ మోన్ జాక్ ఆరోపించారు. 2006లో వచ్చి ఘనవిజయాన్ని సాధించిన హ్యాపీ ఫీట్ సినిమాకు సీక్వెల్ గా రూపుదిద్దుకోనున్నహ్యాపీ ఫీట్ 2 సినిమాలో బ్రిటానీని గొరిల్లా పాత్రలో నటించమని అడిగారని వచ్చిన పుకార్లలో నిజం లేదని, అది కేవలం వారికి బ్రిటానీ మీద వున్న కోపాన్ని తీర్చుకోవడానికి సృష్టించినది మాత్రమే అని ఆయన వార్నర్ బ్రదర్స్ సంస్థ మీద మండిపడ్డారు.
ఈ పుకార్ల తర్వాత బ్రిటానీని హాలీవుడ్ లో ఎంత ఘోరంగా ట్రీట్ చేసారో ప్రత్కేకంగా చెప్పాల్సిన అవసరం లేదని, దీంతో ఆమె మరింత క్షోభపడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. టీనేజిలోనే గుండె సంబంధిత వ్యాధితో బాధపడ్డ ఆమె తమ వివాహానికి ముందు ఎంతో ఆరోగ్యంగా వుందని, ఆ తర్వాత జరిగిన పరిణామాలతో మానసిక క్షోభను భరించలేక ఆమె గుండె మరింత బలహీనపడిందని, ఈ పరిణామానే ఆమె ప్రాణాలు తీసాయని ఆయన దగ్ధస్వరంతో తెలిపారు. కాగా ఈ సినిమాలో నటించనున్న బ్రాడ్ పిట్, మ్యాటీ దామన్ లకు బ్రిటానీతో తమ స్నేహాన్ని గుర్తుంచుకొని ఈ సినిమాను ఒదులుకొమ్మని చెబుతానని కూడా ఆయన ప్రకటించారు. ఓ విధంగా బ్రిటానీది హత్య అని, హాలీవుడ్, వార్నర్ బ్రదర్స్ సంస్థ కలసి ఈ హత్యను చేసారని ఆయన వ్యాఖ్యానించారు.


Click it and Unblock the Notifications











