twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    2018లో హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రాలు ఇవే.. (టాప్ 10 లిస్ట్)

    |

    సినిమా ఎన్ని రోజులు ఆడింది అన్నది కాదు.. ఎంత వసూలు చేసిందనేదే మ్యాటర్. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఇదే ట్రెండ్ నడుస్తోంది. అందుకే పెద్ద సినిమాలను వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో విడుదల చేసి తొలి వారంలోనే మాగ్జిమమ్ వసూళ్లు రాబట్టే ప్రయత్నాలు చేస్తుంటారు.

    ప్రపంచ వ్యాప్తంగా తీసుకుంటే అమెరికా కేంద్రంగా నిర్మాణం అయ్యే హాలీవుడ్ సినిమాలదే పైచేయి. బడ్జెట్ పరంగా చూసుకున్నా, టెక్నికల్ అంశాల పరంగా చూసుకున్నా.... వాటిని అందుకోవడం ఇతర సినిమాల వల్ల కాదు. వసూళ్ల పరంగా కూడా బాక్సాఫీసు వద్ద అద్భుతాలు క్రియేట్ చేస్తుంటాయి. మరికొన్ని రోజుల్లో 2018కి వీడ్కోలు పలుకుతున్న నేపథ్యంలో హయ్యెస్ట్ గ్రాస్ వసూలు చేసిన సినిమాలు ఏమిటనే విషయమై ఓ లుక్కేద్దాం...

    #10 స్థానంలో...

    #10 స్థానంలో...

    2018లో అత్యధిక గ్రాస్ వసూలు చేసిన చిత్రాల్లో 10వ స్థానంలో నిలిచింది చైనీస్ వార్ ఫిల్మ్ ‘ఆపరేషన్ రెడ్ సీ'. 70 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 579.2 మిలియన్ డాలర్లు రాబట్టింది. అంటే మన కరెన్సీలో రూ. 4 వేల 92 కోట్లు.

    #09 స్థానంలో

    #09 స్థానంలో

    అమెరికన్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘రెడీ ప్లేయర్ వన్' మూవీ 582.2 మిలియన్ డాలర్లు వసూలు చేసి 9వ స్థానంలో నిలిచింది. 175 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా మన కరెన్సీ ప్రకారం రూ. 4 వేల 133 కోట్లు రాబట్టింది.

    #08వ స్థానంలో

    #08వ స్థానంలో

    ఈ ఏడాది వచ్చిన అమెరికన్ సూపర్ హీరో ఫిల్మ్ ‘ఆంట్ మ్యాన్' వసూళ్ల పరంగా 8వ స్థానం దక్కించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ 622.6 మిలియన్ డాలర్ రాబట్టింది. అంటే మన కరెన్సీ లెక్క ప్రకారం రూ. 4 వేల 399 కోట్లు రాబట్టింది.

     #7వ స్థానంలో

    #7వ స్థానంలో

    అమెరికన్ సూపర్ హీరో ఫిల్మ్ ‘డెడ్ పూల్ 2' ఈ ఏడాది విడుదలై వసూళ్ల పరంగా 7వ స్థానం దక్కించుకుంది. 110 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూమీ ప్రపంచ వ్యాప్తంగా 734.2 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. అంటే రూ. 5 వేల 187 కోట్లు.

     #6వ స్థానంలో...

    #6వ స్థానంలో...

    టామ్ క్రూయిజ్ మూవీ మిషన్ ఇంపాజబుల్ -ఫాలౌట్ ఈ ఏడాది వసూళ్ల పరంగా 6వ స్థానం దక్కించుకుంది. 178 మిలియన్ డాలర్ల ఖర్చుతో రూపొందిన ఈ చిత్రం 791 మిలియన్ డాలర్లు రాబట్టింది. అంటే రూ. 5 వేల 588 కోట్లు.

     #5వ స్థానంలో...

    #5వ స్థానంలో...

    మార్వెల్ కామిక్స్ ఆధారంగా రూపొందిన అమెరికన్ సూపర్ హీరో ఫిల్మ్ ‘వెనమ్' ఈ ఏడాది వసూళ్ల పరంగా 5వ స్థానం దక్కించుకుంది. 100 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 844 మిలియన్ డాలర్లు రాబట్టింది. అంటే రూ. 5 వేల 963 కోట్లు.

     #4 స్థానంలో...

    #4 స్థానంలో...

    డిస్నీ సంస్థ నుంచి వచ్చిన కంప్యూటర్ యానిమేటెడ్ చిత్రం ‘ఇంక్రెడబుల్ 2' వసూళ్ల పరంగా 4 వ స్థానం దక్కించుకుంది. 200 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 1.241 బిలియన్ డాలర్ రాబట్టింది. అంటే రూ. 8 వేల 766 కోట్లు.

    #3వ స్థానంలో...

    #3వ స్థానంలో...

    జూరాసిక్ పార్క్ సిరీస్‌లో ఈ ఏడాది వచ్చిన మరో చిత్రం ‘జూరాసిక్ వరల్డ్-ఫాలెన్ కింగ్డమ్'. ఈ మూవీ వసూళ్ల పరంగా 3వ స్థానం దక్కించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 1.305 బిలియన్ డాలర్లు వసూలు చేసింది. అంటే రూ. 9 వేల 220 కోట్లు.

     #2వ స్థానంలో..

    #2వ స్థానంలో..

    మార్వెల్ కామిక్స్ ఆధారంగా తెరకెక్కిన అమెరికన్ సూపర్ హీరో ఫిల్మ్ ‘బ్లాక్ పాంథర్' ఈ ఏడాది వసూళ్ల పరంగా 2వ స్థానం దక్కించుకుంది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 1.347 బిలియన్ డాలర్లు వసూలు చేసింది. అంటే రూ. 9 వేల 516 కోట్లు.

     #1 స్థానంలో...

    #1 స్థానంలో...

    ఈ ఏడాది వచ్చిన బిగ్గెస్ట్ మూవీ ‘అవేంజర్స్ ఇన్ఫినిటీవార్'. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 2.048 బిలియన్ డాలర్లు వసూలు చేసి చరిత్ర సృష్టించింది. అంటే 14 వేల 468 కోట్లు రాబట్టింది. ఆల్ టైమ్ రికార్డ్స్ తీసుకుంటే అవతార్, టైటానిక్, స్టార్స్ వార్స్ తర్వాతి స్థానంలో ఈ మూవీ ఉంది.

    English summary
    Hollywood Highest-grossing films of 2018. Disney-Marvel Studios’ “Avengers: Infinity War” has surpassed the $2 billion mark at the global box office in 48 days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X