twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాలీవుడ్ డ్రీమ్ గర్ల్ ఎలిజబెత్ టేలర్ కన్నుమూత

    By Srikanya
    |

    హాలీవుడ్ కలలరాణి ఎలిజబెత్ టేలర్ (79) బుధవారం కన్నుమూశారు. కొంతకాలంగా గుండెకు సంబంధించిన అస్వస్థతతో బాధపడుతూ, రెండు నెలల కిందట లాస్ ఏంజెలిస్‌లోని సెడార్స్సినాయ్ ఆస్పత్రిలో చేరిన ఆమె, ఆస్పత్రిలోనే తుదిశ్వాస విడిచారు. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు గల ఎలిజబెత్ టేలర్ బాలనటిగా రంగ ప్రవేశం చేశారు. నాలుగు దశాబ్దాల సుదీర్ఘకాలం నటనా రంగంలో కొనసాగిన ఆమెకు మూడుసార్లు ఆస్కార్ అవార్డు లభించింది. బటర్‌ఫీల్డ్ 8(1960), హూ ఈజ్ అఫ్రైడ్ ఆఫ్ వర్జీనియా వుల్ఫ్ (1966) చిత్రాలు ఆమెకు ఆస్కార్ అవార్డులు తెచ్చిపెట్టాయి. ఆమె చేపట్టిన సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా 1993లో మరోసారి అవార్డు లభించింది. క్లియోపాత్రా లోని నటన ఆమెకు ఎనలేని కీర్తి తెచ్చిపెట్టింది. ఎనిమిదిసార్లు చేసుకున్న పెళ్లిళ్లు, దివంగత పాప్ రారాజు మైకేల్ జాక్సన్‌తో అనుబంధం, ఆమె చుట్టూ వ్యాపించిన వదంతులు, వివాదాలు ఆమెను నిరంతరం వార్తల్లో నిలిపాయి. ఎలిజబెత్‌కు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు, పదిమంది మనవలు, నలుగురు ముని మనవలు ఉన్నారు. దాదాపు యాభైకి పైగా సినిమాల్లో నటించిన ఎలిజబెత్ టేలర్, చివరిసారిగా 2006లో సీఎన్‌ఎన్ చానల్ నిర్వహించిన లారీ కింగ్ లైవ్ అనే్ టాక్ షోలో కనిపించారు.

    English summary
    Screen legend Elizabeth Taylor, the violet-eyed film goddess whose sultry screen life was often upstaged by her stormy personal life, died Wednesday at age 79.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X