ఆస్కార్ డైరెక్టర్ చేతిలో ‘కిల్ బిన్ లాడెన్’ హాలీవుడ్ మూవీ..!?
అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామాబిన్ లాడెన్‌ను పాకిస్తాన్‌లో అమెరికా ప్రత్యేక దళాలు చంపడంతో హాలీవుడ్ సినిమాల రూపకర్తలకు ఓ మంచి కథాంశం దొరికింది. యాక్షన్ సినిమాలను రూపొందించే ఫిల్మ్ మేకర్స్ లాడెన్‌పై చిత్రాలు రూపొందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆస్కార్ అవార్డు విజేత కత్రిన్ బిగిలో లాడెన్‌పై ఓ చిత్రాన్ని రూపొందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు.
ప్రఖ్యాత హాలీవుడ్ డైరెక్టర్ కత్రిన్ బిగిలో ఇరాక్ యుద్ధంపై రూ పొందించిన 'ద హర్ట్ లాకర్" చిత్రానికిగాను ఆస్కార్ అవార్డును గెల్చుకున్నారు. ఆయన లాడెన్‌పై 'కిల్ బిన్ లాడెన్" అనే చిత్రాన్ని రూ పొందించే పనిలో ఉన్నారు. పాకిస్తాన్‌లోని అబొట్టాబాద్ నగరంలో ఈనెల 2న లాడెన్‌ను అమెరికా ప్రత్యేక దళాలు చంపడంపై ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది. ఈ చిత్రానికి స్క్రిప్ట్‌ను మార్క్ బోల్ రాయ నున్నట్టు సమాచారం. వీలైనంత తొందరగా ఈ చిత్రాన్ని రూపొందించి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్ర రూపకర్తలు ప్రయత్ని స్తున్నారు.
వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని యాక్షన్ సినిమాగా రూపొందించేందుకు డైరెక్టర్ బిగిలో సిద్ధమవుతున్నారు. 'అంతర్జాతీయ ఉగ్రవాది బిన్ లాడెన్ గురించి అందరికీ తెలిసిందే. అతను అమెరికాపై దాడులు చేస్తూ అగ్రరాజ్యాన్ని వణికించాడు. చివరికి ఆ దేశంపై యుద్ధాన్నే ప్రకటించాడు. జిహాద్ పేరుతో మారణ హోమం సృష్టిస్తూ వేలాదిమందిని పొట్టనబెట్టుకున్నాడు. అల్‌ఖైదా ఆధ్వర్యంలో ఉగ్రవాద దాడులకు పాల్పడ్డాడు. అగ్రరాజ్యం దాడుల బారి నుంచి తప్పించుకునేందుకు పాకిస్తాన్‌లో తలదాచుకున్నాడు.చివరికి అమెరికా ప్రత్యేక దళాలు లాడెన్ అబొట్టాబాద్‌లో దాగి ఉన్నట్టు కనుక్కొని దాడులు జరిపి అతన్ని మట్టుబెట్టాయి. ఇటువంటి వాస్తవ సంఘటనలకు కొంత సినీ మసాలాను జోడించి కిడ్ బిన్ లాడెన్ చిత్రాన్ని నిర్మించనున్నాము" అని బిగిలో తెలిపారు.


Click it and Unblock the Notifications











