Avatar 2 Trailer: మరోసారి అద్భుతమైన విజువల్ ట్రీట్.. బాక్సాఫీస్ బ్లాస్ట్ కావడం పక్కా!
ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది సినీ లవర్స్ ఎదురుచూస్తున్న సినిమాలలో అవతార్ 2: ది వే ఆఫ్ వాటర్ మొదటి స్థానంలో ఉంటుంది అని చెప్పవచ్చు. గ్రాండ్ గా విడుదల కాబోతున్న ఈ సినిమాపై అంచనాలు అయితే మామూలుగా లేవు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదలవుతున్న ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమాను సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు. ట్రైలర్ ఇప్పుడు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఆ వివరాల్లోకి వెళితే..

అందుకే ఆలస్యం
విజువల్ అడ్వెంచర్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న జేమ్స్ కెమెరూన్ ఇప్పుడు మరొక మ్యాజిక్ క్రియేట్ చేయడానికి సిద్ధమయ్యాడు. 2009లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అవతార్ సినిమాకు కొనసాగింపుగా ఇప్పుడు సెకండ్ పార్ట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. అసలయితే 2014లోనే ఈ సినిమా రావాల్సింది. కానీ మరొక మూడు సీక్వెల్స్ ను ప్రకటించడంతో సరికొత్త టెక్నాలజీతో అవతార్ ను రూపొందించారు. కరోనా కారణంగా కూడా ఈ సినిమా విడుదల మరింత ఆలస్యమైంది.

ట్రైలర్ లో హై రేంజ్ విజువల్స్
ఇక మొత్తానికి ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను కూడా ఇటీవల విడుదల చేయగా పండోరా అద్భుత సృష్టిని చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు అనే విధంగా ఉంది. మొదటి పార్ట్ లో దర్శకుడు ఆ ఉపగ్రహాన్ని పూర్తిస్థాయిలో చూపించలేకపోయాడు. కానీ ఈసారి మొత్తంగా సముద్రం లోతుకు తీసుకువెళ్లి అక్కడ సరికొత్త విజువల్స్ ని హైలెట్ చేయబోతున్నాడు.

ఎలా ఎదుర్కొన్నాడు?
ట్రైలర్లో సరికొత్తగా డైనోసర్స్ అలాగే కథానాయకుడి వారసుడు కూడా కనిపిస్తున్నాడు. హీరో మానవాళి నుంచి ఎదురైనా మరొక ప్రమాదాన్ని తన సైన్యంతో ఎలా ఎదుర్కొన్నాడు అనేది ఈ సినిమాలోని ప్రధాన కథాంశంగా తెలుస్తోంది. అయితే దాదాపు మొదటి పార్ట్ తరహాలోనే కథ ఉన్నప్పటికీ కూడా ఈసారి పండోరా ఉపగ్రహంలో ఎవరు చూడని కొన్ని అద్భుతాలను ప్రజెంట్ చేయబోతున్నట్లు ట్రైలర్ లో చూపించారు.
అద్భుతమైన విజువల్స్
సరికొత్త యాక్షన్ అడ్వెంచర్ తో పాటు ఈసారి ఎమోషనల్ కంటెంట్ కూడా హైలెట్ కాబోతున్నట్లు అర్థమవుతుంది. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈసారి భారీ యాక్షన్ సన్నివేశాలు అండర్ వాటర్ లో ఎలా కొనసాగుతాయి అనేది ఆసక్తిగా మారింది.

గ్రాండ్ రిలీజ్
ఇక జాక్ పండోర ఉపగ్రహాన్ని కాపాడడానికి ఎలాంటి ఎత్తులు వేశాడు అనేది కూడా ట్రైలట్ లో ఆసక్తిని కలిగిస్తోంది. తప్పకుండా అవతార్ 2 కూడా వెండితెరపై సరికొత్త విజువల్ ట్రీట్ ఇవ్వబోతున్నట్లు అర్ధమవుతోంది. ఇక ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబర్ 16న గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. సరికొత్త టెక్నాలజీతో 3D వెర్షన్ లో ఈ సినిమా ఆకట్టుకుంటుంది అని జేమ్స్ కెమెరున్ నమ్మకంతో ఉన్నాడు.


Click it and Unblock the Notifications











