OTTలోకి సూపర్ హిట్ 1640 కోట్ల సినిమా... ఎందులో స్ట్రీమింగ్ అవ్వనుందంటే?

హాలీవుడ్‌ అంటేనే కళ్లు చెదిరే యాక్షన్‌ సీన్స్ కళ్ల ముందు మెదులుతుంటాయి. అందులోనూ మార్వెల్‌ యూనివర్స్‌ చిత్రాలంటే ఏ రేంజ్‌లో ఆడియెన్స్ను ఆకట్టుకుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ యూనివర్స్‌ నుంచి మూవీ వస్తుందంటే చాలు, ఫ్యాన్స్ తెగ సంబర పడిపోతుంటారు. వరల్డ్ వైడ్గా చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ఈ సిరీస్‌ చిత్రాల కోసం మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఇప్పటికే ఈ సంస్థ నుంచి వచ్చిన 'బ్లాక్‌ పాంథర్‌', 'ది అవెంజర్స్‌', 'స్పైడర్‌ మ్యాన్‌', కెప్టన్‌ మార్వెల్‌' వంటి చిత్రాలు బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఇప్పుడు ఈ సిరీస్‌ నుంచి వచ్చిన మరో చిత్రం 'ది మార్వెల్స్‌'. మార్వెల్‌ స్డూడియోస్‌ నిర్మించిన ఈ సినిమా థియేటర్లలలో కూడా సూపర్ హిట్ టాక్తో ఆడింది. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ రిలీజ్కు రెడీ అయింది.

సహజంగా సూపర్‌ హీరో సినిమాలంటే యూనివర్స్‌లో ఓ హీరో చేసే సాహసాలను, స్టంట్స్‌ను సిల్వర్ స్క్రీన్పై చూపిస్తారు. కానీ ఈ సారి దీనికి భిన్నంగా వచ్చందీ సినిమా. ఈ మూవీ కోసం మొదటి సారి ముగ్గురు కథానాయికలు కలిసి నటించడం విశేషం. ఉమెన్‌ పవర్‌ చూపిస్తూ మార్వెల్‌కు చెందిన ముగ్గురు సూపర్‌ హీరోయిన్స్‌ ఒకే సినిమాలో కనిపించబోతుండటం వల్ల ఓటీటీ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.

Hollywood Movie The Marvels OTT Release Date in Disney Hotstar from February 7th Full Datails Here

ఈసారి 'ది మార్వెల్స్‌' కోసం వరల్డ్ వైడ్గా ఉన్న సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. హాలీవుడ్ ప్రముఖ కామిక్ నిర్మాణ సంస్థ మార్వెల్ స్టూడియోస్ నిర్మించిన ఈ మోస్ట్ అవైటెడ్ చిత్రం థియేటర్లలో మంచి టాక్ను అందుకుంది. ఇప్పుడీ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ వేదికగా డిస్నీ+ హాట్ స్టార్లో ఫిబ్రవరి 7 నుంచి వరల్డ్ వైడ్గా స్ట్రీమింగ్ కానుంది.

ఈ చిత్రాన్ని ప్రముఖ హాలీవుడ్‌ దర్శకురాలు నియో డకోస్టా తెరకెక్కించారు. ఇందులో బ్రీ లార్సెన్‌, టెయోనా ప్యారిస్‌, ఇమాన్‌ వెల్లని, పార్క్‌ సియో జూన్‌ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో కెప్టెన్‌ మార్వెల్‌ పాత్రలో బ్రీ లార్సెన్‌ నటించింది. యాక్షన్‌, అడ్వెంచర్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కింది.

కథేంటంటే : తన శక్తులను లాక్కున్న క్రీ నుంచి వాటిని తిరిగి సాధించి తనపై ప్రతీకారం తీర్చుకుంటుంది మార్వెల్‌. కానీ కొన్ని కారణాల వల్ల క్రీ శక్తుల నుంచి విశ్వాన్ని కాపాడే బాధ్యతను తనపై వేసుకుంటుంది మార్వెల్. కెప్టన్‌ మార్వెల్‌కు వెలుతురును స్వాధీనం చేసుకునే శక్తి ఉంటుంది. దాన్ని స్వయంగా చూసే శక్తి మోనికా రాంబోకి, వెలుతురునే ఒక వస్తువుగా మార్చే శక్తి మిస్‌ మార్వెల్‌కు ఉంటుంది. ఇప్పుడు ఈ ముగ్గురు కలిసి 'ది మార్వెల్స్‌'గా విశ్వాన్ని రక్షించటానికి ఎలాంటి సాహసాలు చేశారో తెలియాలంటే ఈ సినిమాలో చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X