twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గుండెపోటుతో ప్రముఖ గాయకుడు మృతి.. విషాదంలో సంగీతలోకం

    |

    హాలీవుడ్‌లో ప్రముఖ సింగర్, రచయిత బిల్ విథర్ ఇక లేరు. హృదయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ మరణించారు. ఆయన వయసు 81 సంవత్సరాలు. సోమవారం లాస్ ఎంజెలెస్‌లో మరణించారని కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఆయన మృతితో మంచి గాయకుడిని సంగీత ప్రపంచం కోల్పోయిందని సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. ఆయన మృతిపట్ల విచారం వ్యక్తం చేశారు.

    బిల్ విథర్స్ ఇకలేరనే విషయాన్ని తెలియజేయడానికి తీవ్ర దిగ్బ్రాంతిలో ఉన్నాం. తన సంగీతం, కవిత్వంతో ఎంతో మంది హృదయాల్లో చోటు సంపాదించుకొన్న ఆయన మరణించారనే వార్తను చేరవేయడానికి దుఖిస్తున్నాం అని ఓ కుటుంబం ఓ ప్రకటనలో తెలిపారు.

     Hollywood Musician Bill Withers no more

    బిల్ విథర్ విషయానికి వస్తే.. మూడుసార్లు గ్రామీ అవార్డు విజేతగా నిలిచారు. 1980లోనే ప్రొఫెషన్ నుంచి తప్పుకొన్నారు. కానీ సంగీత ప్రపంచంతో, ప్రముఖులతో మమేకమయ్యారు. ఎయింట్ నో సన్‌షైన్, లీన్ ఆన్ మీ అనే ఆల్బమ్స్ మంచి ప్రేక్షకాదరణను సొంతం చేసుకొన్నాయి.

    బిల్ మృతిపై సంగీత ప్రముఖులు బిల్లీ డీ విలియమ్స్, లిన్ మాన్యువేల్ మిరండా తమ సంతాప ప్రకటనను సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. సంగీత ప్రపంచంలో లెజెండ్ లాంటి వ్యక్తిని కోల్పోవడం చాలా విషాదంగా ఉంది. ఆయన లేని లోటు ఎవరూ పూడ్చలేనిది అని అన్నారు.

    English summary
    Hollywood Musician Bill Withers no more. He died on Monday in Los Angeles, said family.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X