జైలులో ప్రముఖ దర్శకుడికి ఆరోగ్య పరిస్థితి విషమం.. హాస్పిటల్‌కు తరలింపు!

ప్రముఖ దర్శకుడు, నిర్మాత హార్వే వెయిన్‌ స్టెయిన్ అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్‌లో చేరారు. నటిపై మానభంగం కేసులో జీవిత కాలపు శిక్షను అనుభవిస్తున్న ఆయనను మాన్‌హట్టన్‌లోని ప్రముఖ హాస్పిటల్‌లో చేర్చించారని ఆయన తరఫు లాయర్ మీడియాకు వెల్లడించారు. తన శిక్ష కాలాన్ని పెంచాలని న్యూయార్క్ కోర్టు తీర్పు వెల్లడించిన మరుసటి రోజే ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించిన వివరాల్లోకి వెళితే..

హార్వే వెయిన్ స్టెయిన్ తీవ్ర అనారోగ్యానికి గురైన విషయం నిజమే. ఆయన శారీరకంగా చాలా బలహీన పడ్డారు. ఆయనకు మరొకరి సహాయం లేకుండా ఉండలేకపోతున్నారు. ఆయన ఆరోగ్యానికి సంబంధించిన వైద్య పరీక్షలు జరుగుతున్నాయి అని న్యాయవాది తెలిపారు.

Hollywood producer Harvey Weinstein admitted to Bellevue Hospital in Manhattan from New York Jail

హార్వే వెయిన్ స్టెయిన్ ఆరోగ్య పరిస్థితి తీవ్రమైన పరిస్థితిలో ఉంది. ఆయనకు కస్టడీలో ఉంచి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకొని..వెంటనే వైద్య పరీక్షలు చేయించాలని నిర్ణయం తీసుకొన్న న్యూయార్క్ కోర్టుకు ధన్యవాదాలు అంటూ న్యాయవాది ఓ ప్రకటనలో తెలిపారు.

హార్వేపై నమోదైన రేప్ కేసులో ఆరంభంలో కొందరి సాక్ష్యాలు పరిగణనలోకి తీసుకోలేదని భావించిన ఈ కోర్టు.. కొత్తగా తీర్పు నిచ్చింది. ఆయన శిక్షకాలాన్ని పెంచే విధంగా న్యూయార్క్ కోర్టు తీర్పునివ్వడం అందర్నీ దిగ్బ్రాంతికి గురిచేసింది.

Hollywood producer Harvey Weinstein admitted to Bellevue Hospital in Manhattan from New York Jail

మానభంగం, క్రిమినల్ ఆరోపణలపై హార్వేపై జూన్ 2020 సంవత్సరంలో సంచలన తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ఆయనకు 23 సంవత్సరాల జైలుశిక్షను విధించింది. మిరియం హాలే, జెస్పీకా మాన్ సాక్ష్యాల ఆధారంగా ఈ కేసులో కఠిన శిక్షను విధించడం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X