బాలీవుడ్ నుండి మరఠ్వాడా మహారాణిగా బిపాసా బసు..!
హాలీవుడ్ కి బిపాసా బసు వెళ్ళనుందని సమాచారం. వెళ్ళటం అంటే అక్కడికి ఏదో టూరిస్ట్ గా వెళ్ళటం లేదు. వివరాల్లోకి వెళితే ప్రముఖ బాలీవుడ్ నటీమణి బిపాసా బసు త్వరలో హాలీవుడ్ సినిమాలో నటించనుంది. హాలీవుడ్ లో నిర్మిస్తున్న' సింగ్యులారిటీ' అనే చిత్రంలో బిపాసా బసు నటిస్తోంది. ఈ హాలీవుడ్ చిత్రంలో బిపాసా బసు మరఠ్వాడా మహారాణిగా నటిస్తుంది. అంటే మారాఠీ మహారాణిగా నటిస్తుందన్నమాట. ఈ మరాఠీ మహారాణికీ, ఒక బ్రిటీష్ సైనికుడికీ మధ్య జరిగే ప్రేమకథ ఈ చిత్రంలో ఒక భాగంగా ఉంటుందట.
ఈ 'సింగ్యులారిటీ" చిత్రం మనకు స్వాతంత్ర్యం రాక ముందు బ్రిటీష్ వారి కాలంనాటి కథతో నిర్మించబడుతోంది. బిప్స్ ప్రిన్స్ మహేష్ బాబు నటించిన 'టక్కరి దొంగ" అనే మన తెలుగు సినిమాలో నటించింది. అలాగే రీసెంట్ గా'దమ్ మారో దమ్" అనే హిందీ చిత్రంలో మన తెలుగు హీరో రాణా సరసన హీరోయిన్ గా నటించింది. గతంలో ఐశ్వర్యారాయ్, మల్లికా షెరావత్ వంటివారు హాలీవుడ్ చిత్రాల్లో నటించారు. మన తెలుగు సినీ పరిశ్రమ నుంచి హీరోయిన్లంతా బాలీవుడ్ కి వెళుతూంటే బాలీవుడ్ భామలంతా తమ దృష్టి హాలీవుడ్ పైకి సారిస్తున్నారు.


Click it and Unblock the Notifications











