Don't Miss!
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- News విశాఖ లోక్సభ పరిధిలో ఆ సామాజిక వర్గందే పెత్తనం..బొత్స ఝాన్సీకి కలిసొస్తుందా..?
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
కనీవినీ ఎరుగని రీతిలో కలెక్షన్లు...హాలీవుడ్ లో రికార్డుల మోత...!!
హాలీవుడ్ కు ఈ సంవత్సరం బాగా కలసివచ్చిందని చెప్పవచ్చు. పట్టిందల్లా బంగారమే అన్నట్టు ప్రతీ సినిమా రికార్డు స్థాయి కలెక్షన్లతో విజృంభించడంతో, ఈ ఏడాది ఓ సరికొత్త అధ్యాయాన్ని సృష్టించింది. ఇన్ని సంవత్సరాల హాలీవుడ్ చరిత్రలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో ఈ సంవత్సరం టికెట్ అమ్మకాల ఆదాయం పది బిలియన్ డాలర్ల మార్కుని దాటింది.
2007వ సంవత్సరంలో వసూలయిన 9.68 బిలియన్ డాలర్లే ఇప్పటి వరకూ వున్న రికార్డు. కానీ ఈ ఏడాది 2007వ సంవత్సరం అమ్మకాల కంటే ఎక్కువ అమ్మకాలు సాధించినట్టు హాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ సంవత్సరాంతంలో విడుదలయిన మైఖేల్ జాక్సన్ డాక్యుమెంటరీ చిత్రం 'దిస్ ఈజ్ ఇట్', ఇంకో రెండేళ్లలో ఈ యుగం అంతం అయిపోతుందనే కథాంశంతో వచ్చిన '2012', ట్విలైట్ కు సీక్వెల్ గా వచ్చిన 'న్యూ మూన్', ఫుట్ బాల్ ప్లేయర్ కథాంశంతో రూపొందించిన 'ది బ్లైండ్ సైడ్' సినిమాలు రికార్డు స్థాయిలో వసూళ్లను సాధించాయి.
వీటితో పాటు క్రిస్ట్ మస్ సీజన్ ను దృష్టిలో వుంచుకొని రూపొందించిన భారీ చిత్రాలు జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో వస్తోన్న 'అవతార్', 'షెర్లాక్ హాల్మెస్' లాంటి ప్రతిష్టాత్మక చిత్రాలు విడుదల కావాల్సివుండటంతో ఈ ఏడాదిలో మిగిలివున్న 15 రోజుల్లో మరింతగా వసూళ్లను రాబట్టి సరికొత్త రికార్డులు సృష్టించనుందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.