భారతీయుల కోసం గొంతు సవరించుకోనున్న హాలీవుడ్ సింగర్..!!
గ్రామీ అవార్డులకు నామినేట్ అయిన ప్రముఖ హాలీవుడ్ సింగర్ లిస్బెత్ స్కాట్ ఓ భారతీయ సినిమాకు గాత్రం అందించేందుకు అంగీకరించింది. లాహోర్ పేరుతో రూపొందుతున్న ఈ బాలీవుడ్ సినిమా కోసం ఆమె ఓ పాట పాడనుంది. వ్యానీ షార్ప్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం భారత్-పాకిస్తాన్ ల మధ్య గల సంబంధం గురించి తీస్తున్నారు.
ఇంతకు ముందు అవతార్, షెర్లాక్ హాల్మస్, ట్రాన్స్ ఫార్మర్స్, ఇండియానా జోన్స్ వంటి సూపర్ హిట్ చిత్రాలకు పాటలు పాడిన ఈమె లాహోర్ కథను వినగానే ఉద్వేగానికి లోనయ్యారట. ఖచ్చితంగా ఈ సినిమా కోసం పాడతానని మాటిచ్చారట. ఈ పాట ఖచ్చితంగా ప్రేక్షకుకులకు ఓ అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుందని సినిమా దర్శకుడు సంజయ్ అభిప్రాయపడ్డారు.
వార్నర్ బ్రదర్స్ సంస్థ వారు పంపిణీ చేస్తున్న ఈ చిత్రం భారీ అంతనాల మధ్య మార్చి 19న విడుదల కానుంది.
గ్రామీ అవార్డులు హాలీవుడ్ బాలీవుడ్ లిస్బెత్ స్కాట్ ఇండియా లాహోర్ పాకిస్తాన్ grammy awards hollywood bollywood lisbeth scott lahore india pakistan


Click it and Unblock the Notifications