వద్దనుకున్నోడే మళ్లీ దగ్గరయ్యాడు... ఆ హీరోయిన్ గర్భం దాల్చిందా?
హాలీవుడ్ స్టార్స్ బ్రాడ్ పిట్, జెన్నిఫర్ ఆనిస్టన్ మరోసారి వార్తల్లో వ్యక్తులుగా మారారు. గతంలో భార్యా భర్తలైన వీరు చాలా ఏళ్ల క్రితమే విడిపోయిన సంగతి తెలిసిందే. తర్వాత బ్రాడ్ పిట్ ఏంజెలీనా జోలీని పెళ్లి చేసుకున్నారు. జెన్నిఫర్ కూడా రైటర్, డైరెక్టర్ జస్టిన్ థెరోక్స్‌ను వివాహం చేసుకున్నారు.
అయితే ఇపుడు బ్రాడ్ పిట్, జెన్నిఫర్ ఆనిస్టన్ మళ్లీ కలవడం చర్చనీయాంశం అయింది. అంతే కాదు బ్రాడ్ పిట్ వల్ల జెన్నిఫర్ ఇటీవలే గర్భం దాల్చిందట. ఈ విషయం హాలీవుడ్ సర్కిల్‌లో హాట్ టాపిక్ అయంది.

బ్రాడ్ పిట్, జెన్నిఫర్
బ్రాడ్ పిట్, జెన్నిఫర్ 2005లోనే కొన్ని విబేధాల కారణంగా విడిపోయారు. ఆ తర్వాత ఇద్దరూ వేర్వేరు వ్యక్తులను పెళ్లి చేసుకున్నప్పటికీ వారితోనూ పొసగక... విడిపోయిన పక్షులు ఒక్కటైనట్లు మళ్లీ కలిసి జీవిస్తున్నారు.

తమ బంధం మరింత బలపడాలనే...
చాలా కాలం తర్వాత మళ్లీ కలిసిన బ్రాడ్ పిట్, జెన్నిఫర్.... తమ ప్రేమ బంధం బలంగా ఉండాలనే ఇద్దరూ బిడ్డను కనాలని నిర్ణయించుకున్నారట. ఇటీవలే ప్రెగ్నెంట్ అయిన జెన్నిఫర్ తన స్నేహితులతో ఈ శుభవార్త పంచుకున్నట్లు తెలుస్తోంది.

ఏంజెలీనా జోలీతో విడాకులు
బ్రాడ్ పిట్, ఏంజెలీనా జోలీ విడాకుల వ్యవహారం ప్రస్తుతం కోర్టు విచారణలో ఉంది. ఇద్దరి పేరుపై ఉన్న కొన్ని ఆస్తులు, పిల్లల కష్టడీ విషయంలో వీరి మధ్య ఏకాభిప్రాయం కుదరక పోతుండటంతో విడాకుల వ్యవహారం సాగుతూ వస్తోంది.
Recommended Video


మళ్లీ పెళ్లాడబోతున్నారా?
జస్టిన్ థెరోక్స్‌తో జెన్నిఫర్ ఆనిస్టిన్ సెంబర్ 2016లోనే విడిపోయారు. మళ్లీ తన మాజీ భర్త బ్రాడ్‌పిట్‌కు దగ్గరైన జెన్నిఫర్.... అతడితోనే కలిసి జీవించాలని నిర్ణయించుకుంది. ఈ ఇద్దరూ త్వరలో మళ్లీ పెళ్లి చేసుకునే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.


Click it and Unblock the Notifications











