మళ్లీ ప్రేమలో పడ్డ 61ఏళ్ల స్టార్ హీరో... ఈసారి 36 ఏళ్ల అమ్మాయితో డేటింగ్!

సినిమా ఇండస్ట్రీలో అఫైర్స్, పెళ్లిళ్లు సర్వ సాధారణం అయిపోయింది. చాలా మంది స్టార్ హీరోలు, హీరోయిన్లు.. ప్రేమలో పడటం, డేటింగ్ చేయడం కామన్. అయితే ఓ 61 ఏళ్ల స్టార్ హీరో.. నాలుగవ సారి ప్రేమలో పడ్డాడు. అది కూడా 36ఏళ్ల అమ్మాయితో ప్రేమలో పడినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ విషయం చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. అసలు ఆ హీరో ఎవరు.. ఎవరు ఆ అమ్మాయి.. అనే వివరాలు ఈ స్టోరీలో చూసేద్దాం.

హాలీవుడ్ హీరో టామ్ క్రూజ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ హీరో తెలుగు వారికి కూడా సుపరిచితమే. ఆయన సినిమాలు తెలుగు వారు కూడా చాలా ఇష్టం. తన సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. అయితే తాజాగా ఈ హీరోకి సంబంధించిన న్యూస్ హాట్ టాపిక్ గా మారిపోయింది. 61 ఏళ్ళ వయసు గల టామ్ క్రూజ్ 36 ఏళ్ళ అమ్మాయితో ప్రేమలో పడ్డారని అక్కడ వార్తలు గుప్పుమంటున్నాయి.

Hollywood Star Tom Cruise Relationship With Russian Socialite Elsina Khayrova News Goes Viral

ప్రస్తుతం ఈ వార్త హాలీవుడ్ మీడియాలో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ ప్రేమ విషయం గత ఏడాది డిసెంబర్ లో బయటికి వచ్చినా మరోసారి నెట్టింట వైరల్ గా మారింది. రష్యాకి చెందిన ప్రముఖ మోడల్ 'ఎల్సినా ఖైరోవా'తో టామ్ క్రూజ్ ప్రేమలో పడ్డారని వార్తలు వస్తున్నాయి. గత ఏడాది డిసెంబర్ లో లండన్‌లోని మేఫెయిర్‌ లో ఈ జంట కలిసి పార్టీలో పాల్గొన్నారని సమాచారం.

అప్పటినుంచే వీరిద్దరి ప్రేమ రూమర్స్ మీడియాలో వైరల్ గా మారాయి. అంతేకాదు ఈ జంట ఇటీవల లండన్ లోని ఎయిర్ అంబులెన్స్ ఛారిటీకి మద్దతు ఇచ్చే ఛారిటీ డిన్నర్‌ లో మెరిసారు. అలాగే లండన్‌ లోని కొన్ని ప్రత్యేకమైన రెస్టారెంట్‌ లలో డిన్నర్స్ చేస్తూ.. ఎప్పుడు వార్తల్లో నిలిచారు. ఎల్సినా ఇంటికి సమీపంలోని హైడ్ పార్క్‌ లో జంటగా చక్కర్లు కొడుతున్నారని హాలీవుడ్ లో వార్తలు వచ్చాయి.

ఇక తమ ప్రైవసీ దెబ్బతినకుండా ఉండేందుకు టామ్ క్రూజ్ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు బయటకి రాకుండా చూస్తున్నారట. కాగా హాలీవుడ్ మీడియాలో తాజాగా వినిపిస్తున్న వార్తలు ఏంటంటే.. టామ్ క్రూజ్, ఎల్సినాతో కలిసి తన అపార్ట్మెంట్ లోనే డేటింగ్ చేస్తున్నరని తెలుస్తోంది. ఈ వార్తలు అక్కడ బాగా ప్రచారం అవుతున్నాయి. మరి వీటిలో ఎంత నిజముందో తెలియదు కానీ టామ్ క్రూజ్ కి ఇప్పటికే మూడుసార్లు పెళ్లి చేసుకున్నాడు.

Hollywood Star Tom Cruise Relationship With Russian Socialite Elsina Khayrova News Goes Viral

అంతే కాదు ఆయనకు మూడు సార్లు విడాకులు కూడా అయ్యాయి. ఇప్పుడు 61 ఏళ్ల వయసులో 36 ఏళ్ల అమ్మాయితో డేటింగ్ చేయడంతో హాట్ టాపిక్ గా మారింది. 1987 లో మిమీ రోజర్స్‌ ని వివాహం చేసుకున్న టామ్ క్రూజ్.. 1990 విడాకులు ఇచ్చి ఆ తరువాత నికోల్ కిడ్‌మాన్ ను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఆమెతో 2001లో విడిపోయారు. 2006లో కేటీ హోమ్స్‌ తో రిలేషన్ మొదలుపెట్టిన టామ్ క్రూజ్.. 2012 ఆమెతోనూ విడిపోయారు. ఇప్పుడు ఎల్సినా ఖైరోవాతో రిలేషన్ మొదలుపెట్టారని సమాచారం..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X