స్టార్ హీరో, హీరోయిన్‌ విడాకుల వివాదం ముగిసింది... ఇద్దరూ ఇపుడు సింగిల్!

హాలీవుడ్ స్టార్స్ ఏంజెలీనా జోలీ, బ్రాడ్ పిట్ తమ లాంగ్ టైమ్ రిలేషన్‌షిప్ తెంచుకుంటూ విడాకులకు అప్లై చేసిన సంగతి తెలిసిందే. అయితే వీరి విడాకుల వ్యవహారంలో పలు క్లిష్టమైన సమస్యలు ఉండటంతో దాదాపు 2 సంవత్సరాలుగా ఈ కేసు కొలిక్కి రాలేదు. పలు వాయిదాలు, ఇరువర్గాల వాదోపవాదాలు అనంతరం ఎట్టకేలకు కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసింది.

తమను చట్టపరంగా ఒంటరి(సింగిల్) వ్యక్తులుగా కన్సిడర్ చేయాలని రిక్వెస్ట్ చేయడంతో... జడ్జి వారి విన్నపాన్ని అంగీకరించారు. ఇద్దరూ కూడా తమ పిల్లలకు ఏది బెస్ట్ అనే విషయాలపైనే పూర్తి ఫోకస్ పెట్టినట్లు హాలీవుడ్ మీడియా కథనం.

ఆరుగురు పిల్లలకు సంబంధించిన బాధ్యలు

ఆరుగురు పిల్లలకు సంబంధించిన బాధ్యలు

ఏంజెలీనా జోలీ, బ్రాడ్ పిట్ తమ ఆరుగు పిల్లలకు మడోక్స్, పాక్స్, జహారా, షిలోతో పాటు కవలలు నోక్స్, వివిన్నేలకు సంబంధించిన బాధ్యతలను పంచుకోబోతున్నారు. వాస్తవానికి వీరి విడాకుల వ్యవహారం ఇంతకాలం కొలిక్కి రాకపోవడానికి కారణం పిల్లలు, ఆస్తులే.

సహజీవనం, పెళ్లి, విడాకులు

సహజీవనం, పెళ్లి, విడాకులు

పెళ్లికి ముందే కొన్నేళ్ల పాటు సహజీవనం చేసిన బ్రాడ్ పిట్, ఏంజెలీనా జోలీ 2014లో మ్యారేజ్ చేసుకున్నారు. అయితే ఇద్దరి మధ్య కొన్ని విషయాల్లో విబేధాలు రావడంతో వివాహం జరిగిన కెండేళ్లకే విడిపోవాలని నిర్ణయించుకుని విడాకులకు అప్లై చేసుకున్నారు.

ఇద్దరి మధ్య కుదరని ఏకాభిప్రాయం

ఇద్దరి మధ్య కుదరని ఏకాభిప్రాయం

ఏంజెలీనా జోలీ పిల్లల సంరక్షణ తనకే అప్పగించాలని డిమాండ్ చేసింది.ఈ విషయంలోనే ఇద్దరి మధ్య వివాదం మరింత ముదిరింది. పిల్లల పెంపకం, వారి ఫైనాన్షియల్ సెటిల్మెంట్స్ విషయంలో ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదరక పోవడంతో విడాకుల కేసు సాగుతూ వచ్చింది.

టెంపరరీ చైల్డ్ కస్టడీ అగ్రిమెంటుకు అంగీకారం

టెంపరరీ చైల్డ్ కస్టడీ అగ్రిమెంటుకు అంగీకారం

2018 జూన్లో... ఒక జడ్జి పిల్లలను కలవడానికి బ్రాడ్ ఫిట్‌కు షెడ్యూల్ రూపొందించారు. అయితే మడోక్స్ విషయంలో మాత్రం అతడి వయసు దృష్ట్యా... తన తండ్రితో కలిసి ఎంత సమయం గడపాలి అనేది అతడే నిర్ణయించుకునే విధంగా వెసులుబాటు కలిగించారు. 2018 నంబర్లో ఇద్దరూ టెంపరరీ చైల్డ్ కస్టడీ అగ్రిమెంటుకు అంగీకరించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X