Hollywood Strike హాలీవుడ్‌లో సమ్మె ఉధృతం.. Oppenheimer, Gladiator 2 పై భారీ దెబ్బ
హాలీవుడ్‌లో స్క్రీన్ రైటర్స్, యాక్టర్లు చేపట్టిన సమ్మె ఉధృతంగా మారింది. హాలీవుడ్‌కు చెందిన వేలాది మంది కార్మికులు, సాంకేతిక నిపుణులు, ప్రముఖులు ఈ సమ్మెకు అండగా నిలిచారు. స్క్రీన్ యాక్టర్ గిల్డ్, అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ టెలివిజన్ అండ్ రేడియో సంస్థలు గత కొద్ది రోజులుగా సమ్మె చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సమ్మె వివరాల్లోకి వెళితే..
హాలీవుడ్‌లో తొలిసారి 1960లో సమ్మె జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సమ్మె జరగకపోవడం గమనార్హం. దాదాపు 63 ఏళ్ల తర్వాత సమ్మె ఉధృత రూపం దాల్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముప్పు కారణంగా అభద్రతాభావానికి గురైన సినీ వర్గాలు తమ జీతాలు, రెమ్యునరేషన్ల విషయంలో హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సమ్మెకు పిలుపునిచ్చారు. గురువారం చర్చలు విఫలం కావడంతో సమ్మెను కొనసాగిస్తున్నారు.

స్క్రీన్ యాక్టర్ గిల్డ్, అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ టెలివిజన్ అండ్ రేడియోలో అన్ని విభాగాలు సమ్మెలో పాల్గొంటున్నాయి. దాదాపు 1.6 లక్షల మంది ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. పలు సినిమా షూటింగులు వాయిదా పడ్డాయి. అమెరికాలోనే కాకుండా యూరప్, యూకేలో కూడా సమ్మె ప్రభావం పడింది.
జూలై 21వ తేదీన రిలీజ్ అవుతున్న ఆపెన్‌మీమెర్ (Oppenheimer) సినిమాపై సమ్మె ప్రభావం పడింది. ఈ సినిమా ప్రీమియర్‌ను నటీనటులు బహిష్కరించారు. ఈ చిత్రంలో నటించిన నటీనటులతోపాటు మాట్ డామెన్, ఎమిలీ బ్లంట్, సిలియాన్ మర్ఫీ లాంటి వాళ్లు లండన్ ప్రీమియర్ నుంచి వాకౌట్ చేయడం సమ్మె ప్రభావం ఏమిటో తెలియజేసింది.

పలు దేశాల్లో హాలీవుడ్ సమ్మె ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నది. మొరాకోలో జరుగుతున్న గ్లాడియేటర్ 2 స ినిమా షూటింగ్ నిలిచిపోయింది. హాలీవుడ్‌లో అగ్ర నటులు టామ్ క్రూజ్, జార్జి క్లూనీ, ఎంజెలెనీ జోలీ, ప్రియాంక చోప్రా తదితర నటులు ఈ సమ్మకు మద్దతు తెలిపారు.
హాలీవుడ్ సమ్మె ప్రభావం ఫిలింఫెస్టివల్స్, ఈవెంట్లపై కూడా పడింది. టొరెంటో ఫిలిం ఫెస్టివల్ నిర్వాహకులు ఈ సమ్మె నేపథ్యంలో మల్లగుల్లాలు పడుతున్నారు. అలాగే వెనీస్ ఫిలింఫెస్టివల్, సాన్ డీయాగో కామిక్ కాన్ ఫెస్టివల్‌పై భారీ ప్రభావం పడే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











