హాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. టార్జాన్ హీరో కన్నుమూత..
Tarzan Hero Ron Ely: హాలీవుడ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ హాలీవుడ్ టీవీ సిరీస్ 'టార్జాన్' హీరో రాన్ ఎలీ కన్నుమూశారు. 86 ఏళ్ల వయస్సులో రాన్ ఏలీ మృతిచెందారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయన కూతురు కిర్‌స్టెన్ ఎలీ సోషల్‌మీడియా వేదికగా వెల్లడించింది. ఆయన ఎప్పుడు, ఎలా చనిపోయారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ప్రముఖ హాలీవుడ్ టీవీ సిరీస్ టార్జాన్ సినీ లవర్స్ కు తెలిసే ఉంటుంది. ఈ సీరిస్ లో హీరో గా నటించిన రాన్ ఎలీకీ మంచి పేరొచ్చింది.
రాన్ ఎలీ కూతురు కిర్‌స్టెన్ ఎలీ తన తండ్రి మరణవార్తను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ఈ విధంగా రాసుకొచ్చింది. "ప్రపంచం తనకు తెలిసిన గొప్ప వ్యక్తులలో ఒకరిని కోల్పోయింది. నేను నా తండ్రిని కోల్పోయాను. మా నాన్నని ప్రజలు హీరో అని పిలుచుకునేవారు. ఆయన కేవలం నటుడే కాదు.. రచయిత, కోచ్, గురువు, కుటుంబ వ్యక్తి , నాయకుడు.' అని పేర్కొంది.

'ఆయన ఎక్కడికి వెళ్లినా..ఆయన సానుకూల ప్రభావం ఇతరులపై ఎప్పుడూ ఉండేది. ఆయనలో నిజంగా ఏదో అద్భుతం ఉంది. ప్రపంచం అతని గురించి తెలుసుకుంది. మా నాన్నే నా ప్రపంచం. నాకు రోల్ మోడల్. ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలి. మా కోసం ఆయన ఓ ప్రపంచాన్ని సృష్టించారు.ఆయన మరణం మా కుటుంబానికి తీరని లోటు."అని ఆమె పేర్కొన్నారు.
రాన్ ఎలీ మరణం హాలీవుడ్ లో తీరని లోటు అని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఇండస్ట్రీలోని పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











