హాలీవుడ్ ట్రేడ్ రిపోర్ట్- టాప్ ప్లేస్ లో 2012
ఈ వారం హాలీవుడ్ బాక్సాఫీస్ ట్రేడ్ రిపోర్ట్ లో '2012' సినిమా మొదటి స్థానంలో నిలిచింది. 65 మిలియన్ డాలర్లు వసూలు చేసిన ఈ సినిమా ఈ ఘనతను సాధించింది. ఎన్నో రోజులుగా ఊరిస్తూ, ఎట్టకేలకు నవంబరు 12వ తారీఖున విడుదలయిన ఈ సినిమా స్క్రీన్ ప్లే వీక్ గా వున్నా ఇదొక సాంకేతికి అద్భుతంగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. ఈ-ఆన్ లైన్ రిపోర్ట్ ప్రకారం ఈ రిపోర్టు వెలువడింది. కాగా డిస్నీ మూవీస్ వారి 'ఎ క్రిస్ట్ మస్ కరోల్' చిత్రం 22.3 మిలియన్ డాలర్లు వసూలు చేసి రెండవ స్థానంలో నిలిచింది. మైఖేల్ జాక్సన్ సినిమా 'దిస్ ఈజ్ ఇట్' 5.1 మిలియన్ డాలర్లు వసూలు చేసి ఐదవ స్థానంలో నిలబడింది.
కాగా ఈ వారం బాక్సాఫీస్ వద్ద టాప్-10 లిస్ట్ సినిమాలు ఇలా వున్నాయి:
1. 2012 ---- 65 మిలియన్ డాలర్లు
2. ఎ క్రిస్ట్ మస్ కరోల్ ---- 22.3 మిలియన్ డాలర్లు
3. ది మెన్ హూ స్టేర్స్ అట్ గోట్స్ ---- 6.2 మిలియన్ డాలర్లు
4. ప్రీషియస్ ---- 6.1 మిలియన్ డాలర్లు
5. దిస్ ఈజ్ ఇట్ ---- 5.1 మిలియన్ డాలర్లు
6. ది ఫోర్త్ కైండ్ ---- 4.7 మిలియన్ డాలర్లు
7. కపుల్ రీ-ట్రీట్ ---- 4.3 మిలియన్ డాలర్లు
8. పారానార్మల్ యాక్టివిటీ ---- 4.2 మిలియన్ డాలర్లు
9. లా అబిడింగా సిటిజన్ ---- 3.9 మిలియన్ డాలర్లు
10. ది బాక్స్ ---- 3.2 మిలియన్ డాలర్లు


Click it and Unblock the Notifications











