హాలీవుడ్ ట్రేడ్ రిపోర్ట్
గత వారం విడుదలయిన 'ట్విలైట్' సినిమా సీక్వెల్ 'ది న్యూ మూన్' సినిమా ఏకంగా 140.7 మిలియన్ డాలర్లు వసూలు చేసి ఈ వారం బాక్సాఫీస్ వద్ద అగ్రస్థానంలో నిలబడింది. ఇ-ఆన్ లైన్ వెళ్లడించిన ట్రేడ్ రిపోర్టు ప్రకారం 'ది బ్లైండ్ స్లైడ్' సినిమా 34.5 మిలియన్ డాలర్లు వసూలు చేసి రెండవ స్థానంలో నిలిచింది. ఈ యుగం 2012తో అంతం అయిపోతందనే అంశంలో ఎన్నో అంచనాల మధ్య క్రితం వారం విడుదలయిన 2012 సినిమా ఈ వారం రెండు స్థానాలు దిగజారి 3వ స్థానంలో నిలిచింది. కాగా ఈ సినిమా 26.5 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. 'ప్లానెట్ 51' సినిమా 12.6 మిలియన్ డాలర్లు వసూలు చేసి 4వ స్థానం లో నిలిచింది.
కాగా బాక్సాఫీసు వద్ద టాప్ టెన్ స్థానాల్లో నిలబడిన సినిమాల వివరాలు ఇలా వున్నాయి:
1. ది న్యూ మూన్ ---- 140.7 మిలియన్ డాలర్లు
2. ది బ్లైండ్ స్లైడ్ ---- 34.5 మిలియన్ డాలర్లు
3. 2012 ---- 26.5 మిలియన్ డాలర్లు
4. ప్లానెట్ 51 ---- 12.6 మిలియన్ డాలర్లు
5. ఎ క్రిస్ట్ మస్ కరోల్ ---- 12.2 మిలియన్ డాలర్లు
6. ప్రీషియస్ ---- 11 మిలియన్ డాలర్లు
7. ది మెన్ హూ స్టేర్ అట్ గోట్స్ ---- 2.8 మిలియన్ డాలర్లు
8. కపుల్ రీట్రీట్ ---- 2 మిలియన్ డాలర్లు
9. ది ఫోర్త్ కైండ్ ---- 1.7 మిలియన్ డాలర్లు
10. లా అబిండింగ్ సిటిజన్ ---- 1.6 మిలియన్ డాలర్లు


Click it and Unblock the Notifications











