'అవతార్' ప్రభంజనానికి చెక్ పెట్టలేకపోయిన 'షెర్లాక్ హాల్మస్'..!!
వెండి తెర పై అద్భుతమయిన పాండారా లోకాన్ని ఆవిష్కరించి, ప్రేక్షకులని ఆనందాశ్చర్యాలలో అచ్చరువొందేలా చేసిన సినిమా 'అవతార్'. విడుదలయిన మొదటి రోజు నుండీ బాక్సాఫీసు వద్ద కనక వర్షాన్ని కురిపిస్తున్న ఈ సినిమా రెండో వారం కూడా కలెక్షన్ల ప్రభంజనాన్ని కొనసాగిస్తోంది. జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సాంకేతిక అద్భుతం వరుసగా రెండో సారి కూడా హాలీవుడ్ బాక్సాఫీసు వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది.
గత వారం ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన షెర్లాక్ హాల్మెస్ లాంటి భారీ అంచనాలు వున్న సినిమా విడుదలయినా అవతార్ ఖజానాకు గండి కొట్టలేకపోయింది. కానీ ఈ సినిమా తన వంతుగా తొలి వారం 65.4 మిలియన్ డాలర్లను వసూలు చేసి రెండవ స్థానంలో నిలిచింది. కాగా ఈ సినిమా కథాంశం షెర్లాక్ హాల్మస్ అనే ఓ డిటెక్టివ్ చుట్టూ తిరుగుతుంది. గత వారం ట్రేడ్ రిపోర్ట్ లో రెండవ స్థానంలో నిలిచిన డిస్నీ మూవీస్ వారి యానిమేషన్ సినిమా 'ది ప్రిన్సెస్ అండ్ ది ఫ్రాగ్' ఈ సారి ఏడవ స్థానంతో సరిపెట్టుకుంది. ఈ వారం హాలీవుడ్ బాక్సాఫీసు వద్ద టాప్-10 స్థానాల్లో నిలిచి చిత్రాల వివరాలు ఇలా వున్నాయి.
1. అవతార్ ---- 75 మిలియన్ డాలర్లు
2. షెర్లాక్ హాల్మెస్ ---- 65.4 మిలియన్ డాలర్లు
3. ఆల్విన్ అండ్ చిప్ముంక్స్: స్వీక్వెల్ ---- 50.2 మిలియన్ డాలర్లు
4. ఇట్స్ కాంప్లికేటెడ్ ---- 22.1 మిలియన్ డాలర్లు
5. అప్ ఇన్ ది ఎయిర్ ---- 11.8 మిలియన్ డాలర్లు
6. ది బ్లైండ్ సైడ్ ---- 11.7 మిలియన్ డాలర్లు
7. ది ప్రిన్సెస్ అండ్ ది ఫ్రాగ్ ---- 8.7 మిలియన్ డాలర్లు
8. నైన్ ---- 5.5 మిలియన్ డాలర్లు
9. డిడ్ యు హియర్ అబౌట్ ది మోర్గన్న్ ---- 5 మిలియన్ డాలర్లు
10. ఇన్విక్టస్ ---- 4.4 మిలియన్ డాలర్లు


Click it and Unblock the Notifications











