For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాలీవుడ్ ట్రేడ్ రిపోర్ట్: టాప్ చైర్ లో దిస్ ఈజ్ ఇట్

    By Staff
    |

    మంగళవారం విడుదల చేసిన యూరప్ బాక్సాఫీస్ రిపోర్టులో మైఖేల్ జాక్సన్ సినిమా 'దిస్ ఈజ్ ఇట్' టాప్ చైర్ ను దక్కించుకొంది. గత వారం విడుదలయిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రికార్డులు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. లండన్ లో 50 షోలకు గాను ఈ సినిమా 7.9 మిలియన్ డాలర్లు వసూలు చేసి మొదటి స్థానంలో నిలిచింది. కాగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 103.9 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. డిస్నీ సంస్థ నిర్మించిన 'పిక్సర్స్ అప్' అనే యానిమేషన్ సినిమా 6.4 మిలియన పౌండ్లను వసూలు చేసి రెండవ స్థానంలో నిలిచింది.

    మరో యానిమేషన్ సినిమా 'ఫెంటాస్టిక్ మిస్టర్ ఫాక్స్' సినిమా మూడవ స్థానంలోనే కొనసాగుతోంది. హారార్ చిత్రం 'సా VI' సినిమా రెండవ స్థానం నుండీ నాల్గవ స్థానానికి పడిపోయింది. మరో హారర్ చిత్రం 'సర్క్యూ డూ ఫ్రీక్' మరో సారి ఐదవ స్థానాన్ని పొందింది. కపుల్స్ కలిగే మనస్పర్థల మధ్య తిరిగే కథ 'కపుల్స్ రీగ్రెట్' నాల్గవ స్థానం నుమడీ ఆరవ స్థానానికి పడిపోయింది. మరో యానిమేటెడ్ సైన్స్ ఫిక్షన్ సినిమా '9' ఏడవ స్థానంలో నిలిచింది. 'యాన్ ఎడ్యుకేషన్' సినిమా ఎనిమిదవ స్థానంలోనూ, టెర్రీ దర్శకత్వం వహించిన సినిమా 'ది ఇమ్యాజినేరియమ్' సినిమా ఆరవ స్థానం నుండీ తొమ్మిదవ స్థానానికి పడిపోయింది. కాగా బ్రిటీష్ గ్యాంగ్ స్టర్ సినిమా 'డెడ్ మాన్ రన్నింగ్' సినిమా 10వ స్థానంలో నిలిచింది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X