స్టార్ దంపతుల సంసారంలో చిచ్చు
హాలీవుడ్ స్టార్ జంట టామ్ క్రూజ్, క్యాటీ హాల్మస్ ల మధ్య ఓ చిన్న పాటి యుద్ధం జరిగిందట. అది వారి ముద్దుల కూతురు సూరి విషయంలో. కానీ చివరకి టామ్ రాజీకి వచ్చాడట. అంతకీ విషయమేమిటంటే తమ కూతురుని హాల్మస్ సూరిని క్యాథలిక్ ప్రీ-స్కూల్ లో చేర్చిందట. కానీ ఆమె భర్త టామ్ క్రూజ్ దీన్ని వ్యతిరేఖించాడట. కారణం టామ్ సైస్టోలజిస్ట్ మతాన్ని అనుసరిస్తున్నందున, సూరిని సైస్టోలజిస్ట్ ప్రీ-స్కూల్ లో చేర్చాలని పట్టుబట్టాడట. కానీ క్యాటీ హాల్మస్ తన తల్లిదండ్రులు చెప్పినట్టు సూరిని క్యాథలిక్ ప్రీ-స్కూల్ లో చేర్చింది.
దీంతో వీరి మధ్య స్పర్థలు పొడచూపాయట. కానీ చివరికి టామ్ రాజీ కావడంతో ఈ గొడవకు తెర పడింది. ఇంతుకు మునుపు క్యాథలిక్ మతాన్నే అనుసరిస్తున్న టామ్ 1990లో సైస్టోలజిస్ట్ అనే కొత్త మతంలోకి చేరాడు.
టామ్ క్రూజ్ క్యాటీ హాల్మస్ మెల్బోర్న్ బోస్టన్ హాలీవుడ్ katie holmes tom cruise melbourne boston hollywood


Click it and Unblock the Notifications