twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భర్త నుండి విడాకులు.. లాయర్‌తో డిన్నర్ డేట్

    By Nageswara Rao
    |

    న్యూయార్క్: తన భర్త నుండి విడాకులు ఇప్పించడంలో కీలక పాత్ర పోషించిన న్యూయార్క్ ఆధారిత లాయర్ జోనాథన్ వోల్ఫ్‌కి టామ్ క్రూయిజ్ మాజీ భార్య క్యాటీ హాల్మస్ డిన్నర్ డేట్ ఇచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా జోనాథన్ వోల్స్ భార్య రీనీ ఓ ప్రముఖ వెబ్ సైట్‌కి ఇంటర్యూలో తెలిపింది. 33 సంవత్సరాల వయసు కలిగిన క్యాటీ హాల్మస్‌తో నేను నాభర్త జోనాథన్ వోల్ప్ కలిసి డిన్నర్ డేట్ చేశామని పేర్కొంది.

    గత నెలలో తన భర్త టామ్ క్రూయిజ్‌ నుండి విడాకులు కావాలంటూ న్యూయార్క్ కోర్టులో కేసు ఫైల్ చేసిన దగ్గర నుండి తన భర్త నుండి విడాకులు ఇప్పించడంలో కీలక పాత్ర పోషించాడు. తన భర్త నుండి విడాకులు తీసుకున్న తర్వాత క్యాటీ హాల్మస్ తన కూతురు సూరి క్రూయిజ్‌తో పాటు ఒంటరిగానే జీవితం గడుపుతున్నారు.

    2006వ సంవత్సరంలో క్యాట్ హాల్మస్‌ను టామ్ క్రూయిజ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. క్యాట్ హాల్మస్‌కు ఇదే మొదటి వివాహం కాగా, టామ్ క్రూయజి్‌కు మూడవ వివాహం. టామా క్రూయిజ్ గతంలో హాలీవుడ్ స్టార్ హీరోయిన్లు మిమి రోజెర్స్, నికోల్ కిడ్‌మన్‌లను వివాహం చేసుకున్నాడు. నికోల్ కిడ్ మన్‌లతో కలిసి ఉన్నప్పుడు టామ్ క్రూయిజ్ ఇసాబెల్లా జానే, కానర్ ఆంటోనీ ఇద్దరు పిల్లలను దత్తతు తీసుకున్నాడు. దీంతో టామ్ క్రూయిజ్‌కు మొత్తం ముగ్గురు పిల్లలు.

    ఇక టామ్ క్రూయిజ్ పేరున చాలా వరకు ఎస్టేట్స్ ఉన్నాయి. వీరిద్దరి విడాకుల నేపద్యంలో న్యూయార్క్‌లో ఉన్న అతి పెద్ద విడాకుల న్యాయవాది జోనాథన్ వోల్స్ మాట్లాడుతూ క్యాట్ హాల్మస్, టామ్ క్రూయిజ్‌ల కూతురైన సూరి క్రూయిజ్ లైఫ్ స్టయిల్ నిర్వహణ(కార్లు, కార్యకలాపాలు, బట్టలు, జుట్టు అపాయింట్మెంట్ల)కు గాను పెద్ద మొత్తంలో అవసరం అవుతుంది కాబట్టి విడాకుల అనంతరం టామ్ క్రూయిజ్, క్యాట్ హాల్మస్‌కు భారీ మొత్తంలో చెల్లించనున్నట్లు తెలిపాడు. విడాకులు ఫైనలైజ్ అయిన తర్వాత నవంబర్ 2006 నుండి ఇద్దరూ వారి వారి ప్రాజెక్టుల ద్వారా వచ్చిన సంపాదనను తెలుపుతారు.

    బేవరి హిల్స్‌లో ఉన్న $35 మిలియన్ ఖరీదైన మాన్షన్‌తో పాటు సంవత్సరానికి గాను క్యాట్ హాల్మస్‌కు $3 మిలియన్లు భరణం క్రింద లభించనుందని సమాచారం. కాలిఫోర్నియా కమ్యూనిటీ ఆస్తి చట్టాలలో ముందున్న వివాహ ఒప్పందం ప్రకారం ఏదైనా జంట 11 సంవత్సరాల పాటు కలిసి జీవించి.. ఆ తర్వాత విడాకులు తీసుకున్నట్లైతే వారి ఆస్తులు ఆ జంట ఇద్దరికీ 50/50 సమానంగా పంచబడతాయి. కానీ వీరి విషయంలో అలా జరగదు. ఎందుకంటే టామ్ క్రూయిజ్, క్యాట్ హాల్మస్ ప్రేమించి వివాహం చేసుకోని కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే అవుతుంది.

    తెలుగు వన్ఇండియా

    English summary
    Actress Katie Holmes and her lawyer, Jonathan Wolfe, went out on a dinner date.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X