»   » దీపిక పదుకోన్‌కు అరుదైన గౌరవం, ఆనందంతో ట్వీట్...

దీపిక పదుకోన్‌కు అరుదైన గౌరవం, ఆనందంతో ట్వీట్...

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్లో అగ్ర నటిగా సత్తా చాటిన దీపిక పదుకోన్ ప్రస్తుతం వరుస హాలీవుడ్ అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెలుతోంది. ఈ క్రమంలోనే ఆమెకు అరుదైన గౌరవం దక్కింది. "అకాడెమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ (AMPAS)" సభ్యత్వం లభించింది.

ప్రియాంక చోప్రా తర్వాత ఇందులో సభ్యత్వం దక్కించుకున్న నటిగా దీపిక పదుకోన్ వార్తల్లో వ్యక్తిగా మారింది. ఆస్కార్ అవార్డులు అందించే అకాడెమీ మెంబర్‌గా అవకాశం దక్కడం ఎంతో గౌరవంగా భావిస్తున్నట్లు దీపిక ట్వీట్ చేశారు.

Honoured to be a new Academy member: Deepika Padukone

31 సంవత్సరా దీపిక విన్ డీసెల్ హీరోగా వచ్చిన 'xXx: Return of Xander Cage' అనే సినిమా ద్వారా హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పాటు మరో హాలీవుడ్ సినిమాలో కూడా దీపిక పదుకోన్ అవకాశం దక్కించుకుంది.

Heroines Remuneration | Filmibeat Telugu

కాడెమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ (AMPAS) నుండి గత నెల ప్రపంచ వ్యాప్తంగా 57 దేశాల నుండి 774 మంది సినీ ప్రముఖులకు మెంబర్స్‌గా జాయిన్ కావాల్సిందిగా ఇన్విటేషన్స్ అందాయి. ఇన్విటేషన్లు వచ్చిన ఇతర బాలీవుడ్ ప్రముఖుల్లో అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, ఐశ్వర్యారాయ్ బచ్చన్, గౌతమ్ ఘోష్, బుద్దదేవ్ దాస్ గుప్తా, సల్మాన్ ఖాన్, ఇర్ఫాన్ ఖాన్ లు కూడా ఉన్నారు. ఆస్కార్ అవార్డుల వేడుక, విజేతల ఎంపిక ప్రక్రియలో వీరి ఓటింగ కీలకం కానుందని తెలుస్తోంది.

English summary
Actor Deepika Padukone, who has been inducted as one of the newest members of the Academy of Motion Picture of Arts & Sciences (AMPAS), said on Wednesday that she felt honoured to be included in the Class of 2017.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu