ఇప్పటికీ దర్శకులు అదే అడుగుతున్నారు.. చేశాక పోర్న్ సైట్స్‌లో పెట్టేస్తున్నారు: హీరోయిన్ ఆవేదన

సినిమా అనే రంగుల ప్రపంచంలో అన్నిరకాల సీన్లలో నటిస్తేనే నటీనటులకు లైఫ్. కథ డిమాండ్ చేయాలేగానీ ఎలాంటి సీన్ అయినా చేయక తప్పదు. అయితే కొన్ని సందర్భాల్లో అవే సీన్స్ నటీనటులకు లేనిపోని తలనొప్పులు తెస్తుంటాయి. టెక్నాలజీ పెరిగాక, ఈ మధ్యకాలంలో అలాంటి పరిణామాలు మరీ ఎక్కువయ్యాయి. తాజాగా ఈ విషయమై స్పందిస్తూ షాకింగ్ సంగతులు చెప్పింది హీరోయిన్ కీరా నైట్లే. వివరాల్లోకి పోతే..

లైంగిక వేధింపులు.. నగ్న సన్నివేశాలు

లైంగిక వేధింపులు.. నగ్న సన్నివేశాలు

చిత్రసీమలో హీరోయిన్ల కష్టాలు చెప్పుకోలేనివి. అవకాశాల కోసం లైంగిక వేధింపులకు గురికావడం లాంటి పరిణామాలు ఒకెత్తయితే, తీరా అవకాశం వచ్చాక కథ కోసం, తన కెరీర్ కోసం కెమెరా ముందు నగ్న సన్నివేశాలు, సెక్స్ సీన్స్‌లో నటించడం మరో ఎత్తు. తీరా ఇలా నటించాక ఆ సీన్స్‌పై జరిగే రచ్చ ఇంకో ట్విస్ట్. ఇలాంటి వాటి గురించే నోరు విప్పింది నటీమణి కీరా నైట్లే.

నగ్నసన్నివేశాలను కట్ చేసి పోర్న్ సైట్లలో..

నగ్నసన్నివేశాలను కట్ చేసి పోర్న్ సైట్లలో..

కెరీర్ ప్రారంభంలో ఎలా ఉన్నా.. నటనాపరంగా ఓ స్థాయికి చేరాక నగ్న సన్నివేశాల్లో నటించాలంటే కొందరు నటీమణులు ఒప్పుకోరు. పేరు తెచ్చుకున్నాక కూడా అలాంటి పాత్రల్లో నటిస్తే పరువు పోతుందని భావిస్తారు. పైగా ఈ మధ్యకాలంలో సినిమాల్లోని నగ్న సన్నివేశాలను కట్ చేసి పోర్న్ సైట్లలో పెట్టేస్తున్నారు. ఇదే పరిస్థితి తనకు ఎదురైందని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది హాలీవుడ్ నటి కీరా నైట్లే.

ఇద్దరు పిల్లలున్నారు.. గతంలో నగ్న సన్నివేశాల్లో నటించా

ఇద్దరు పిల్లలున్నారు.. గతంలో నగ్న సన్నివేశాల్లో నటించా

గతంలో నగ్న సన్నివేశాల్లో నటించానని, అప్పట్లో తనకు ఎలాంటి సమస్య ఉండేది కాదని చెప్పింది కీరా నైట్లే. కానీ ఇప్పుడు మాత్రం అలాంటి సీన్లలో నటించలేనని, పెళ్ళై ఇద్దరు పిల్లలున్నారని.. ఇప్పుడు కూడా అలాంటి సన్నివేశాల్లో నటిస్తే వాటిని పోర్న్ సైట్స్‌లో పెట్టేస్తున్నారని వాపోయింది. ఆ సీన్స్ చూసి తనను పోర్న్‌స్టార్ అనుకునే ప్రమాదం ఉందని తెలిపింది.

ఇప్పటికీ దర్శకులు అదే అడుగుతుంటారు

ఇప్పటికీ దర్శకులు అదే అడుగుతుంటారు

ఇద్దరు పిల్లలకు తల్లిని అయినా కూడా ఇప్పటికీ నగ్న సన్నివేశాల్లో నటించాలని దర్శకులు అంటుంటారని కీరా నైట్లే చెప్పింది. అందుకే ఏదన్నా సినిమాకు సంతకం చేసేముందు తన కాంట్రాక్ట్‌లో ''నో న్యూడిటీ క్లాజ్‌'' రాయించుకున్నాకే సంతకం చేస్తానని ఆమె చెప్పుకొచ్చింది.

Recommended Video

Jr NTR Action Scene With Tiger In RRR Remembers A Hollywood Movie || Filmibeat Telugu
ఒకవేళ తప్పదనుకుంటే ఇలా చేస్తా..

ఒకవేళ తప్పదనుకుంటే ఇలా చేస్తా..

ఒకవేళ న్యూడ్ సన్నివేశాల్లో నటించాల్సి వస్తే మాత్రం డూప్ చేత చేయిస్తానని తెలిపింది కీరా. ఆ సీన్లను తానే దగ్గరుండి ఎడిటింగ్ చేయించుకుంటానని, దర్శకనిర్మాతలు వీటన్నింటికీ ఓకే అంటేనే సినిమాకు సంతకం చేస్తానని ఆమె చెప్పింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X