Oscar Awards 2024 ఆస్కార్ విజేతకు షాకింగ్ ప్రైజ్​మనీ - ట్రోఫీని అమ్మాలనుకుంటే మరీ ఇంత చీపా?

సినీ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే పురస్కారం ఏదైనా ఉందంటే అది ఆస్కార్. జీవితంలో ఒక్కసారైనా ఈ అవార్డును ముద్దాడాలని సినీ ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది కలలు కంటుంటారు. అయితే ఈ పురస్కారాన్ని దక్కించుకున్న భారతీయులు చాలా తక్కువ మందే ఉన్నారు. ఈ క్రమంలోనే గతేడాది ఆర్​ఆర్​ఆర్​కు ఆస్కార్ వరించడంతో ఇండియన్ ప్రేక్షకులకు ఈ పురస్కారంపై ఆసక్తి ఎక్కువైంది.

దీంతో ఈ ఏడాది ఆస్కార్​ అవార్డుల కోసం మన దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎదురుచూశారు. తాజాగా ఈ ప్రతిష్టాత్మక అవార్డుల ప్రదానోత్సవం గ్రాండ్​గా జరిగింది. అంగరంగ వైభవంగా నిర్వహించారు మేకర్స్. లాస్ ఏంజెల్స్‌ డాల్బీ థియేటర్‌ వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి వేలాది మంది సినీ తారలు విచ్చేసి సందడి చేశారు. ఊహించినట్లుగానే ఓపెన్‌హైమర్ సినిమా ఏకంగా 7 అవార్డులను ముద్దాడి సత్తా చాటింది. మరి కొన్ని చిత్రాలు కూడా ఈ అవార్డులను అందుకున్నాయి.

How much prize money do Oscar winners 2024 get How much will it sell Full Details Here

అయితే భారత్​ నుంచి ఈ ఏడాది ఆస్కార్ బరిలో దిగిన ఏకైక చిత్రం టూ కిల్​ ఏ టైగర్ డాక్యుమెంటరీ. ఇప్పటివరకు ఎన్నో అవార్డులను అందుకున్న ఈ డాక్యూ ఈ ప్రతిష్టాత్మక వేడుకల్లోనూ సత్తా చాటాలని అంతా ఆశించారు. కానీ దీనికి నిరాశ ఎదురైంది. కానీ ఆస్కార్ స్టేజీ పైన మాత్రం ఈ సారి కూడా నాటు నాటు స్టెప్పులేసి మనకు కాస్త ఆనందాన్ని ఇచ్చారు నిర్వాహకులు.

ఇక ఏ అవార్డు ఫంక్షన్​లోనైనా విజేతలకు ట్రోఫీలతో పాటు ప్రైజ్ మనీలు కూడా ఇస్తుంటారు. మరి ఆస్కార్ గెలిచిన వారికి ఎంత ప్రైమ్ మనీ ఉంటుందో మీకు తెలుసా? షాకింగ్ విషయమేమిటంటే విజేతకు ఎలాంటి ప్రైజ్ మనీ ఉండదు. అవును మీరు చదివింది నిజం. కేవలం బంగారు పూత పూసిన ట్రోఫీని మాత్రమే విజేతకు బహుకరిస్తారు. అయితే ఈ ట్రోఫీ వల్ల ప్రయోజనాలు చాలానే ఉంటాయి. దీనిని ముద్దాడిన వారికి అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఏర్పడుతుంది. పేరు ప్రఖ్యాతులు పొందుతారు. దీంతో పాటు రెమ్యునరేషన్ పెరుగుతుంది.

How much prize money do Oscar winners 2024 get How much will it sell Full Details Here

ఈ ఆస్కార్​ ట్రోఫీని కాంస్యంతో తయారుచేస్తారు. 24 క్యారెట్ల బంగారంతో పూత పూస్తారు. దీనికి తయారు చేయడానికి 1000 డాలర్ల ఖర్చు అవుతుంది. అంటే భారతీయ కరెన్సీలో సుమారు రూ. 82 వేల రూపాయలు అన్నమాట. అయితే విజేతలు ఈ ట్రోఫీని తమ అవసారానికి అమ్మాలనుకుంటే మాత్రం ఎటువంటి ఉపయోగం ఉండదు. దీనికి ఎటువంటి విలువ ఉండదు. అకాడమీకి మాత్రమే అమ్మాల్సి ఉంటుంది. దానికి ప్రతిఫలంగా వారు 1 డాలర్ ఇస్తారు. అంటే కేవలం 82 రూపాయలు. కాగా, ఆస్కార్ అవార్డులను బయటవారికి విక్రయించకుండా ఉండేందుకు అకాడమీ నిర్వాహకులు ఈ తరహా నిబంధనలను రూపొందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X