»   » ఆ హాలీవుడ్ మూవీ తెలుగులో ‘దెయ్యాల‌బండి’గా వస్తోంది!

ఆ హాలీవుడ్ మూవీ తెలుగులో ‘దెయ్యాల‌బండి’గా వస్తోంది!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: గతంలో 5 కల‌ర్స్‌ మల్టీమీడియా మూవీ పతాకంపై ఏకవీర, వెంటాడు-వేటాడు చిత్రాల‌ను నిర్మించారు శ్రీనివాస్‌ దామెర. తాజాగా 5కల‌ర్స్‌ మల్టీమీడియా సమర్పణలో ఎస్‌టిఐఫ్‌ ఎంటర్‌ టైన్‌మెంట్స్‌ పతాకంపై 'హౌల్‌' అనే హాలీవుడ్‌ చిత్రాన్ని తెలుగులోకి 'దెయ్యాల‌బండి' పేరుతో విడుద చేస్తున్నారు.

ఇప్పటికే డబ్బింగ్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల‌ 23న ఇండియా వైడ్‌గా విడుదల‌వుతోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత శ్రీనివాస్‌ దామెర మాట్లాడుతూ... ''ఒక సిటీ నుంచి బయ దేరిన ప్యాసింజర్స్‌ ట్రైన్‌ హెవీ రైన్‌ కారణంగా దట్టమైన అడవుల్లో చిక్కుకుపోతుంది. ఆ సమయంలో ఆ ట్రైన్‌ లోకి వింత వింత ఆకారాతో, హాహాకారాలు చేస్తూ కొన్ని దెయ్యాలు ఆ ట్రైనులోకి ఎంటరై అందులోని ప్యాసింజర్స్‌ని ఏ విధంగా చంపాయి? ఏంటి? అన్నది సినిమా కథ అని తెలిపారు.

Deyyalabandi

*ప్రతి సన్నివేశం ఎంతో ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఇటీవల కాలంలో ఎన్నో హర్రర్‌ చిత్రాలు వచ్చాయి. కానీ ఇది పూర్తిగా డిఫరెంట్‌ ఫిలిం. హాలీవుడ్‌లో గతేడాది విడుదలై భారీ వసూళ్లు రాబట్టింది. తెలుగు ప్రేక్షకుల‌కు నచ్చుతుందన్న ఉద్దేశంతో ఈ చిత్రాన్ని తెలుగులోకి అనువదించి ఈ నె 23న ఇండియా వైడ్‌గా విడుద చేస్తున్నాం'' అన్నారు.

ఈడి స్పీర్స్‌, సీన్‌ పెర్ట్వి, హోలీ వెస్టన్‌, షౌనా మెక్‌నాల్డ్‌, ఇల్లియంట్‌ కాన్‌, కాల్విన్‌ డెన్‌, తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి దర్శకుడు:ఫౌల్‌హిత్‌, నిర్వహణ: రాధాకృష్ణ, నిర్మాత: శ్రీనివాస్‌ దామెర.

English summary
Howl is a direct-to-video 2015 British indie monster movie, directed by Paul Hyett and starring Ed Speleers.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu