twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ట్విట్టర్ ద్వారా ప్రేమను తెలియ జేసుకుంటున్న హార్లే, వార్న్

    By Nageswara Rao
    |

    ఆస్టేలియన్ స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్, బ్రిటీష్ హీరోయిన్ ఎలిజిబెత్ హార్లే ట్విట్టర్ ద్వారా ఆన్‌‌లైన్‌లో వారి ప్రేమను బహిర్గతం చేసుకుంటున్నారు. ఎలిజిబెత్ హార్లే ఆన్‌లైన్‌లో షేన్ వార్న్ క్లిప్స్ చూసేందుకు ఆసక్తితో ఉండగా, వార్న్ మాత్రం తన ప్రేయసి శృంగార బహుమతులు కోసం ట్విట్టర్ పై ఆధారపడుతున్నాడు. 2010 నుండి డేటింగ్ ప్రారంభించిన వీరిద్దరూ డర్టీ మెసేజ్‌లను షేర్ చేసుకునేందుకు గాను సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్‌ని ఉపయోగించు కుంటున్నారు.

    పని బిజీలో ఆస్టేలియా, లండన్, అమెరికా దేశాలలో విహారిస్తుండడం వల్ల వీరిద్దరి మధ్య ప్రేమ నిలకడగా ఉండేందుకు గాను ట్విట్టర్‌ని ఉపయోగిస్తున్నారు. 2013లో బ్రిటీష్ హీరోయిన్ ఎలిజిబెత్ హార్లే , ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్‌వార్న్‌ల వివాహం జరుగనుంది. వీరిద్దరూ బ్రిటన్, ఆస్ట్రేలియాల్లో రెండుసార్లు వివాహం చేసుకోవాలనుకున్నట్లు సమాచారం. వార్న్‌తో ఉన్నప్పుడు తనకెంతో ఆనందంగా ఉంటోంది. మేమిద్దరం పరస్పరం భిన్నమైన రంగాల నుంచి వచ్చినప్పటికీ చాలావిషయాలలో మా ఇద్దరి భావనలు ఒకే విధంగా ఉన్నాయని హార్లే తెలిపింది.

    ఎలిజిబెత్ హార్లే త్వరలో అమెరికాలో బాగా పాపులారిటీని సంపాదించిన 'గాసిప్ గర్ల్' అనే షోలో సెక్సీ మీడియో మొగల్‌గా కనిపించడానికి ప్రయత్నాలు చేస్తుంది. అమెరికాలో మంచి పాపులారిటీని తెచ్చుకున్నటువంటి షోలలో గాసిప్ గర్ల్ షో ఒకటి. ప్రస్తుతం ఈ షో కి సంబంధించిన ఐదవ సిరిస్ త్వరలో ఫ్రారంభం కానుంది. టివి లైవ్ కధనం ప్రకారం గాసిప్ గర్ల్ అనే షోలో ఎలిజిబెత్ హార్లే డైనా పేనీ అనే పాత్రను పోషించనున్నట్లు సమాచారం. ఇది మాత్రమే కాకుండా ఈ షోలో ఎక్కువ ఎపిసోడ్స్‌లో కూడా నటించడానికి ఒప్పుకున్నట్లు సమాచారం.

    ఈ సందర్బంలో గాసిప్ గర్ల్ ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్స్ స్టీఫానై సావేగా, జాషువా సాఫ్రాన్ మాట్లాడుతూ ఈ షోలో ఎలిజిబెత్ క్యారెక్టర్ చాలా సెక్సీగా, అందంగా, మీడియా మొగల్‌గా ఉంటుందని తెలిపారు. ఈ క్యారెక్టర్‌తో ఎలిజిబెత్ హార్లేకి మంచి పేరు రావడమే కాకుండా గాసిప్ గర్ల్ షో కి కూడా మంచి పేరు తెస్తుందని వారి అభిప్రాయాన్ని తెలియజేశారు.

    English summary
    Shane Warne and Elizabeth Hurley have revealed that they keep their love alive online via Twitter. While it lets Hurley watch clips of her Aussie beau online, Warne relies on Twitter for romantic gifts.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X