»   » హాట్ టాపిక్: హంతకుడితో కలిసి టీవీ నటి డేటింగ్

హాట్ టాపిక్: హంతకుడితో కలిసి టీవీ నటి డేటింగ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

లండన్: ఇంగ్లిష్ టీవీ నటి కెర్రీ కొటోనా ఉన్నట్టుండి మీడియాలో హాట్ టాపిక్ అయింది. అది కూడా ఓ వ్యక్తితో కలిసి డేటింగ్ విషయంలో. ఆమె గతంలో చాలా మందితో డేటింగ్ చేసింది...ఇందులో కొత్తేముంది అనుకున్న వారు అసలు విషయం తెలిసి షాకయ్యారు. ఆమె డేటింగ్ చేసిన వ్యక్తి పేరు కెవిన్ లేన్. ఓ హంతకుడు.

కెవిన్ లేన్ గతంలో ఓ హత్య చేసాడు. కారు డీలర్ ను చంపి 18 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు. ఇటీవలే జైలు నుండి విడుదలైన అతడు కెర్రీ కొటోనాతో సన్నిహితంగా ఉంటున్నాడు. ఇద్దరు కలిసి తిరిగితే కేవలం ఫ్రెండ్సే అని సరిపుచ్చుకోవచ్చు. కానీ ఇద్దరు పెదాలు పెదాలు కలిపి ముద్దలు కూడా పెట్టుకోవడంతో ఇద్దరి మధ్య ఎఫైర్ ఉందనే రూమర్స్ కు మరింత బలం చేకూరింది.

'I am not dating anyone!' Kerry Katona

ఈ విషయం మీడియా కంట పడటంతో.... హంతకుడితో కెర్రీ కొటోనా డేటింగ్ చేస్తోందంటూ ఇంటర్నేషనల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. ఈ వార్తలతో కెర్రీ కొటోనా కంగుతింది. అతను తనకు ఇటీవలే పరిచయం అయ్యాడని, అతడి గత జీవితం గురించి నాకు తెలియదు. నాకు కేవలం ఫ్రెండ్ మాత్రమే. అతనితో డేటింగ్ చేయడం లేదు. ఓ ఫోటోకు ఫోజులు ఇచ్చేందుకు మాత్రమే అతన్ని ముద్దు పెడుతున్నట్లు ఫోజు ఇవ్వాల్సి వచ్చింది అని వివరణ ఇచ్చింది.

కెర్రీ కొటోనా మేనేజర్ కూడా ఈ విషయమై మీడియాకు వివరణ ఇచ్చారు. కెర్రీ కొటోనా అతడితో డేటింగ్ చేయడం లేదు, ఓ ఫ్రెండ్ ఇచ్చిన పార్టీలో అతడిని తొలిసారి కలిసింది.... ఆ తర్వాత ఫ్రెండ్స్ అయ్యారు. ఇద్దరి మధ్య ఎలాంటి డేటింగ్ జరుగడం లేదు అని స్పష్టం చేసారు.

English summary
Kerry Katona has blasted claims she is dating a convicted murderer.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu