'నన్ను అలా చంపేయవద్దు': జాకీచాన్
'నాకేమీ కాలేదు.నేను బతికే ఉన్నాను. బాగున్నాను' అంటూ హాలీవుడ్ నటుడు జాకీచాన్ ప్రకటించారు. తాను మరణించినట్లు ఆన్‌లైన్‌లో వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. ఆన్‌లైన్ వార్తల్లో పేర్కొన్నట్లుగా తనకేమీ గుండెపోటు రాలేదనీ...చనిపోలేదనీ పునరుద్ఘాటించారు. మంగళవారం రాత్రి జాకీఛాన్ మరణించాడంటూ అంతటా వార్తలు వచ్చాయి. హాంకాంగ్ హాస్పటిల్లో గుండెపోటుతో మరణించాడని అందులో పేర్కొన్నాడు.దాన్ని ఆయన ఇలా ఖండించారు. అలాగే తనని ఉత్తి పుణ్యానికే తమ సరదా కోసం తనని చంపేయవద్దని అన్నారు. ఈ వివరాలను ఆయన తన ఫేస్‌బుక్ పేజ్‌లో రాశారు. ఇక తాను ఆరోగ్యంగా ఉండటమే కాదు.. తదుపరి చిత్రం కోసం సన్నాహాలు కూడా చేసుకుంటున్నాను సుమా అంటూ జాకీచాన్ రాశారు. ఈ మధ్య కాలంలో ప్రముఖులు మరణించారంటూ ఆన్‌లైన్‌లో సంచలన కథనాలు వెలువడుతున్నాయి. అందులో భాగంగానే జాకీచాన్ కూడా గుండెపోటుతో మరణించారన్న వార్తలు వెల్లువెత్తాయన్నారు.


Click it and Unblock the Notifications











