ఫన్నీ సీన్స్‌లో నటించడం చాలా కష్టం: జేమ్స్ బాండ్ హీరో
లండన్: జేమ్స్ బాండ్ సినిమాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న డేనియల్ గ్రెగ్ ఫన్నీ సీన్స్‌లో నటించాల్సి వచ్చినప్పుడు ఎంతో కష్టపడాల్సి వస్తుందంటున్నాడు. 44 సంవత్సరాల వయసు కలిగిన డేనియల్ గ్రెగ్ గతంలో రెండు జేమ్స్ బాండ్ సినిమాలలో నటించారు. ఇప్పడు డేనియల్ గ్రెగ్ హీరోగా హాలీవుడ్‌లో 'స్కైఫాల్' అనే సినిమా త్వరలో విడుదలకు సిద్దంగా ఉంది.
ఈ సందర్బంగా డేనియల్ గ్రెగ్ మాట్లాడుతూ గతంలో జేమ్స్ బాండ్‌గా సర్ రోజర్ మూరీ ఫన్నీ సీన్స్‌లో చాలా అద్బుతంగా నటించేవారని కొనియాడాడు. ఐతే ఆయనను ఎట్టి పరిస్దితుల్లోనూ అనుకరించకుండా నా స్టైల్‌లోనే ఫన్నీ సీన్స్‌ని చేస్తున్నానని అందుకు ఎక్కువ కష్టపడుతున్నానని అన్నారు. జేమ్స్ బాండ్‌గా రోజర్ మూరీ అత్యధిక సినిమాల్లో నటించారు.
జేమ్స్ బాండ్‌గా రోజర్ మూరీ కామిక్ సీన్స్‌లో నటనను అధ్బుతంగా పండించారు. మంచి స్టోరీ ఐతే గనుక నాలో మరింత నమ్మకం కలుగుతుంది. నాకు తెలిసి నేను నటించిన కామిక్ సీన్స్‌లో రోజర్ మూరీ అంత కాకపోయినా.. కాస్తైన అభిమానుల ప్రశంసలు దక్కుతాయని అనుకుంటున్నాను. త్వరలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాకి ఆస్కార్ అవార్డ్ విన్నర్, టైటానిక్ హీరోయిన్ కేట్ విన్స్ లెట్ మాజీ భర్త శ్యామ్ మెండిస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాలో జేమ్స్ బాండ్ గర్ల్స్‌గా హెలెన్ మేక్కోరీ, ప్రెంచ్ బ్యూటీ బెరనైస్ మార్లోహీ నటిస్తున్నారు. విలన్‌గా ఆస్కార్ విన్నర్ జేవియర్ బార్డిమ్ నటిస్తున్నారు.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications











