twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    41 సంవత్సరాల వయసులో 'నగ్నం'గానా.. ఏంటదీ

    By Nageswara Rao
    |

    మెలనీ స్క్రైస్తో తన 20 సంవత్సరాల కెరియర్‌లో ఎప్పుడూ కూ డా నగ్నంగా ఫోటోలకు ఫోజలివ్వలేదు. కానీ మగవారి మ్యాగజైన్ 'ఇస్‌క్కైర్' కి నగ్నంగా ఫోటోషూట్ చేశారు. 41సంవత్సరాలు వయసు కలిగిన మెలనీ స్క్రైస్తో ఈ సందర్బంలో మాట్లాడుతూ నా జీవితంలో మొట్టమొదటి సారి నగ్నంగా కెమెరా ముందు ఫోటోలకు ఫోజులివ్వడం జరుగుతుంది. గతంలో పొల్చి చూస్తే నా శరీరం ఇప్పుడు కొత్త మేముఛాయతో కనిపించడం వల్లే నగ్నంగా ఫోటోలకు ఫోజులివ్వడానికి ఒప్పుకున్నానని తెలిపారు.

    మెలనీ స్క్రైస్తో జీవితంలో చాలా మంది తనని నగ్నంగా ఫోటోషూట్‌లకు నటించమని అడగడం మాత్రమే కాకుండా దానికి ఎక్కువ మొత్తం డబ్బు ఇస్తామని చెప్పడం వాటన్నింటిని మెలనీ స్క్రైస్తో చాలా సున్నితంగా తిరస్కరించడం జరిగింది. ఐతే మరి ఇప్పుడు నగ్నంగా నటించడానికి ఎందుకు ఒప్పుకున్నారని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఇప్పుడు నా వయసు 41సంవత్సరాలు. ఈ వయసులో నా శరీరం అందమైన షేపుని సంతరించుకుంది. అందుకే ఇప్పడు నగ్నంగా నటించడానికి ఒప్పుకున్నానని అన్నా రు.

    తన శరీరం అందమైన షేపుని సొంతం చేసుకొవడానికి గాను 28 సంవత్సరాలు వయసు కలిగిన తన పర్సలన్ ట్రైనర్ 'గ్రేగ్' తో డేటింగ్ చేయడానికి కూడా ఒప్పుకున్నా రు. అంతేకాదండోయ్ తనకు ఇష్టమైన షేపు రావడం కోసం తను ఎంతగానో ఇష్టపడే పంది మాంసాన్ని కూడా వదిలివేసానని తెలిపారు. చివరగా మెలనీ స్క్రైస్తోని మీకంటే 13 సంవత్సరాలు చిన్నవాడైన గ్రేగ్ తో డేటింగ్ చేయడం పట్ల మీ స్పందన ఏంటని ప్రశ్నించగా..

    దీనికి మెలనీ స్క్రైస్తో నేను గ్రేగ్ లోకల్ జీమ్‌లో మొదటి సారి కలవడం జరిగింది. మా ఇద్దరి మద్య సన్నిహిత్యం, భావాలు ఒకేలా ఉండడంతో పాటు, నేను కావాలనే యుక్త వయసు ఉన్న గ్రేగ్‌ని కోరుకున్నానని తెలిపారు. తనతో కలసి డేటింగ్ చేయడం తప్పు ఏమీ కాదని తనని తాను సమర్దించుకున్నారు. అంతేకాకుండా తనతో డేటింగ్ చేయడం వల్ల నా శరీరానికి కూడా తగు జాగ్రత్తలు తీసుకొవచ్చని తెలివిగా సమాధానాలు చెప్పారు.

    English summary
    Sykes decided to peel off for her first naked photoshoot in men's magazine Esquire at the age of 41.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X