డేటింగ్ పుణ్యమా అని పెళ్శి కాకుండానే తల్లి అవుతున్న పాప్ సింగర్
పాప్ స్టార్ రిహానా త్వరలోనే తల్లిని కావడానికి సిద్దంగా ఉన్నానంటూ ఇటీవల కాలంలో ఇచ్చినటువంటి ఇంటర్వూలలో తెలిపారు. ఎంతోకాలం నుండి లాస్ ఏంజిల్స్ ఫీల్డర్ మాట్ కెంప్ తోడేటింగ్ చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. రిహానా మాట్లాడుతూ ఇప్పిటినుండి లెక్కపెట్టకుంటే సంవత్సరంలోపు తాను తల్లిని కావాలని అనుకున్నట్లు తెలిపారు. ఇదే నాకు పిల్లలను కనడానికి సరైన టైమ్ అని అనుకుంటు్న్నానని అన్నారు. నాకు కనుక అమ్మాయిపుట్టినట్లైతే నా ఆనందానికి అవధులు ఉండవని కూడా చెబుతున్నారు.
వీటితో పాటు తనకు పుట్టినటువంటి పిల్లలను తానే స్వయంగా దగ్గరుండి మరీ చూసుకుంటానని అంటున్నారు. పిల్లలను దూరంగా ఎక్కడో ఉంచి అప్పుడప్పుడు వెళ్శి వాళ్ల యొక్క ఆలనాపాలనా చూడడం లాంటివి నాకు నచ్చవని అన్నారు. ఇప్పుడున్న పరిస్ధితులలో నేను నా పిల్లలకు సరైన కెరియర్ నుఅందివ్వగలను అని అనుకుంటున్నాను. అందుకే మాకు పిల్లలు పుట్టాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఇంతకి అసలు విషయం ఏమిటంటే రిహానాకి మాట్ కెంప్ పెళ్శి కాకపోవడం. అసలు పెళ్శి కాకుండా తల్లి కావాలనే కోరిక ఏంటా అని అనుకుంటున్నారు. ఇంతకీ ఈరిహానా ఎవరా అని అనుకుంటున్నారా. భారతదేశం సాంప్రదాయపద్దతిలో పెళ్శి చేసుకున్నటువంటి కాటి పెర్రి మరియు రస్సెల్ బ్రాండ్ ల స్నేహితురాలు.


Click it and Unblock the Notifications











