ముందు ప్రెగ్నెంట్.. ఆ తర్వాత పెళ్లికి సిద్దం

By Nageswara Rao

ఏంజిలీనా జోలి ఉన్నత భావాలు కలిగిన వ్యక్తి. ఇందుకు సాక్ష్యాలు ఒక హీరోయిన్ గా, డైరెక్టర్ గా, గొప్ప సంఘసంస్కర్తగా కార్యక్రమాలను కొనసాగించడమే కాకుండా, ఆరుగురు పిల్లలకు తల్లిగా తన భాద్యతలను నిర్వర్తిస్తున్న గొప్ప మనసున్న వ్యక్తి. అలాంటి గొప్ప మనసున్న వ్యక్తి ఇటీవల మేరీ క్లెయిర్ అనే మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్యూలో తన మనసులోని మాటలను పంచుకున్నారు.

36 సంవత్సరాలు వయసు కలిగిన ఏంజిలీనా జోలి 1998వ సంవత్సరం నుండి బ్రాడ్ పిట్‌తో కలసి సంసారం చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. బ్రాడ్ పిట్ ద్వారా ఇప్పటికే ముగ్గురు పిల్లలకు తల్లైన జోలి త్వరలో మరో బిడ్డకు జన్మనిచ్చేందుకు సిద్దంగా ఉన్నానని ఈ ఇంటర్యూలో తెలిపారు. తాను దర్శకత్వం వహించిన 'ది ల్యాండ్ ఆఫ్ బ్లడ్ అండ్ హానీ' సినిమా విశేషాలతో పాటు, తన పిల్లలు గురించి సరదాగా కబుర్లు చెప్పారు.

ప్రస్తుతం మాకు ఆరుగురు పిల్లలు. మాడెక్స్(10), పాక్స్(8), జహారా(6), షైలో(6), నాక్స్(3), వివిన్నే(3). మా పిల్లలు గత కొంత కాలంగా నన్ను, బ్రాడ్ పిట్‌ని పెళ్లి చేసుకోమని కోరుతున్నారు. నా జీవితంలో ఇప్పటి వరకు ఏమైనా కోల్పోయానని అనిపిచ్చిందంటే అది కేవలం ఫీమేల్ స్నేహితులు లేకపోవడమేనని అన్నారు. ఇది నాకు బాగా నచ్చే అంశం. ఎందుకంటే ఎదుటివారిని నేను సరదాగా ఆటపట్టించవచ్చు.

నాజీవితంలోకి ఫ్యామిలీ వచ్చిన తర్వాత నేను ఎక్కువ సమయం వారితోనే గడుపుతున్నాను. ఈ విషయంలో నేను బ్రాడ్‌కు కృతజ్ఞతలు చెప్పుకోవాలని అన్నారు. బ్రాడ్ పిట్‌తో కలసి పని చేయడం, మాట్లాడడం నాకు ఎల్లప్పుడూ నచ్చే విషయాలని అన్నారు. బ్రాడ్ పిట్ నా జీవితాన్ని ఎల్లప్పుడూ ఆనందంతో నింపడమే కాకుండా, సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. ఏంజిలీనా జోలి దర్శకత్వం వహించిన 'ది ల్యాండ్ ఆప్ బ్లడ్ అండ్ హానీ' సినిమా ఈ క్రిస్ మస్ వేడుకలకు సరిగ్గా రెండు రోజుల ముందు అంటే డిసెంబర్ 23న విడుదలవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X