»   »  జేమ్స్ బాండ్‌గా నటించడం కంటే చచ్చిపోవడం బెటర్: డేనియల్ క్రెగ్

జేమ్స్ బాండ్‌గా నటించడం కంటే చచ్చిపోవడం బెటర్: డేనియల్ క్రెగ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పపంచ సినీ చరిత్రలో జేమ్స్ బాండ్ సినిమాలకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమాలో హీరోగా నటించే అవకాశం దక్కించుకోవాలంటే మామూలు విషయం కాదు. నటనతో పాటు యాక్షన్, రొమాన్స్ అన్నీ పర్ ఫెక్టుగా పండించగలగాలి. అంతకంటే ముఖ్యంగా ముఖ్యంగా ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేసే విధంగా తెరపై సాహస విన్యాసాలు పండించగలగాలి. ఇవన్నీ చేయడానికి తెర వెనక ఎంత కష్టం, శ్రమ దాగి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఇప్పటికే మూడు సార్లు జేమ్స్ బాండ్ సినిమాల్లో హీరోగా నటించిన డేనియల్ క్రెగ్ త్వరలో రాబోతున్న బాండ్ మూవీ ‘స్పెక్టర్' సినిమాలో మరోసారి ప్రేక్షకులను అలరించబోతున్నాడు. ఈ సినిమా తర్వాత తాను మరోసారి జేమ్స్ బాండ్ పాత్ర చేయనుగాక చేయను అంటున్నాడు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో డేనియర్ క్రెగ్ మాట్లాడుతూ ‘మరోసారి జేమ్స్ బాండ్ గా నటించడం కంటే చచ్చిపోవడం బెటర్. అలాంటి పరిస్థితి వస్తే ఏదైనా గాజుముక్కతో నా మణికట్టును కోసుకుంటా' అని వ్యాఖ్యానించారు. మరోసారి నన్ను చేయమని అడిగితే రెండేళ్లు ఆగమంటాను. రెండేళ్ల తర్వాత ఒక వేళ చేయాలని అనిపిస్తే... అది డబ్బు కోసమే తప్ప మరో కారణం ఉండుద అన్నాడు.

హాలీవుడ్ సిరీస్ జేమ్స్ బాండ్ సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చివరి జేమ్స్ బాండ్ మూవీ ‘స్కై ఫాల్' 2012లో విడుదలైంది. ఇది జేమ్స్ బాండ్ సీరిస్ లో వచ్చిన 23వ సినిమా. ఇక 24వ జేమ్స్ బాండ్ సినిమా ‘స్పెక్టర్' త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

దాదాపు రూ. 2 వేల కోట్ల ఖర్చుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటి వరకు వచ్చిన అన్ని జేమ్స్ బాండ్ సిరీస్ చిత్రాల కంటే అత్యంత భారీ బడ్జెట్ చిత్రం. ఈ సినిమాలో కార్ల చేజింగుతో సాగు యాక్షన్ సీక్వెన్స్ కోసం ఏకంగా రూ. 240 కోట్లు ఖర్చు పెట్టారట. ఈ యాక్షన్ సీక్వెన్స్ అత్యంత ఖరీదైన 7 ఆస్టన్ మార్టిన్ కార్లు ధ్వంసం చేసారు.

I'd rather 'slash my wrists' than play James Bond again: Daniel Craig

‘స్కై ఫాల్' చిత్రానికి దర్శకత్వం వహించిన సామ్ మెండెస్ మరోసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. కాసినో రాయల్(2006), క్వాంటమ్ ఆఫ్ సోలెస్(2008) , స్కైఫాల్(2012) చిత్రాల్లో నటించిన డేనియల్ క్రెగ్ నాలుగోసారి 007 ఏజెంట్ పాత్రలో నటిస్తున్నాడు. గత జేమ్స్ బాండ్ చిత్రాల్లో నటించిన ముఖ్య తారాగణం రాల్ఫ్ ఫిన్నెస్ ‘ఎం' పాత్రలో, నియోమీ హారిస్ ‘ఈవ్ మనీపెన్నీ', బెన్ వైషా ‘క్యూ' పాత్రల్లో నటిస్తున్నారు. జేమ్స్ బాండ్ గర్ల్ గా ఇటాలియన్‌ సుందరి మోనికా బెల్లూసీ నటిస్తోంది.

బెల్లూసీ మాట్లాడుతూ... ''ఈ చిత్రంలో లూసియా సియర్రా అనే మహిళగా నటిస్తున్నాను. ఆమె జీవితంలో ఎన్నో రహస్యాలుంటాయి. తన అందంతో జేమ్స్‌ బాండ్‌ను మాయ చేసే పాత్ర అది. జేమ్స్‌ బాండ్‌ చిత్రాలు సినిమా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయి. అలాంటి చిత్రంలో నేనూ భాగం కావడం సంతోషంగా ఉంది. ఇప్పటివరకూ బాండ్‌ గర్ల్స్‌గా నటించిన వారిపట్ల నాకు గౌరవముంది. వారు ఆ పాత్రలకు వన్నె తెచ్చారు''అని చెప్పింది బెల్లూసీ.

స్కైఫాల్ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించిన జాన్ లోగన్, నీల్ పర్విస్, రాబర్ట్ వాడ్ ఈ చిత్రానికి కూడా పని చేస్తున్నారు. గత జేమ్స్ బాండ్ చిత్రం ‘స్కై ఫాల్' ప్రపంచ వ్యాప్తంగా 1 బిలియన్‌ డాలర్లకు పైగా వసూలు చేసింది. ఈసారి వసూళ్లు మరింత ఎక్కువగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. 'స్పెక్టర్‌' ఈ నెల 26న యూకేలో, వచ్చే నెల 6న అమెరికాలో, 20న మన దేశంలో చిత్రం విడుదలవుతుంది.

English summary
"I'd rather 'slash my wrists' than play James Bond again" Daniel Craig said.
Please Wait while comments are loading...