మాకు అమ్మాయి పుడితే గనుక చందమామలాగే అందంగా చూసుకుంటాం..
హాలీవుడ్ పోష్ గా పిలవబడే ప్రెగ్నెంట్ విక్టోరియా బెకహాం తనకు పుట్టబోయేటటువంటి నాల్గవ బేబి ఆడ లేక మగ అయినా ఫరవాలేదని అన్నారు. ఇప్పటికీ తనకి గానీ తన భర్తకు గానీ పుట్టబోయే బిడ్డ గురించి ఎటువంటి అపోహాలు లేవని అన్నారు. లింగనిర్దారణ ద్వారా మాకు వచ్చే ఉపయోగం కూడా ఏమిలేదని తెలియజేశారు. మాకు అబ్బాయి లేక అమ్మాయి ఎవరు పుట్టిన వచ్చిన ఇబ్బంది ఏమి లేదని ఇటీవల యుయస్‌ఏ టుడే అనే పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో చెప్పారు.
విక్టోరియా బెకహాం, డేవిడ్ బెకహాంలకు ప్రస్తుతానికి ముగ్గురు పిల్లలు ఉన్న విషయం తెలిసిందే..అందులో పెద్దవాడు అయిన బ్రూక్లెన్ వయసు పదకోండు సంవత్సరాలుకాగా, రెండవ వాడు రోమియో వయసు ఎనిమిది సంవత్సరాలుకాగా, ఇక మూడవ వాడు క్రూజ్ అయిదు సంవత్సరాలు వయసు ఉంటుందని బెకహాం తెలియజేశారు.
మాకు పుట్టబోయే నాల్గవ సంతానం కనుక అబ్బాయి అయినట్లైతే మాపిల్లలు చాలా ఆతురతగా ఉన్నారు వాడికి సాకర్ గేమ్ ఎలా ఏర్పాలనేది..అదే గనుక అమ్మాయి అయినట్లేతే ఆమెను చందమామ లాగే అందంగా చూచుకుంటామని అన్నారు.


Click it and Unblock the Notifications











