పిల్లలు ముందు వల్గర్ లాంగ్వేజి మాట్లాడనంటున్న సూపర్ మోడల్
హాలీవుడ్‌లో అందాల జంట సూపర్ మోడల్ హైదీ క్లూమ్ మరియు సీల్. ఈ జంటలో ఓ ప్రత్యేకత ఉంది. ఏమిటా ఆ ప్రత్యేకత అని అనుకుంటున్నారా వీరిద్దరూ సింగర్స్ కావడమే. ఈ ముప్పై ఏడు సంవత్సరాల సూపర్ మోడల్ హైదీ క్లూమ్ ఇటీవల మాట్లాడుతూ పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు వారి ముందు ఎటువంటి అసభ్యకరమైన పదజాలం మాట్లాడనని అన్నారు. హైదీ క్లూమ్ మరియు సీల్ ప్రేమకు అపురూపంగా నలుగురు పిల్లలు పుట్టడం జరిగింది. వారిని ఎంతో అపురూపంగా చూచుకోవడం జరుగుతుందని హైదీ క్లూమ్ అన్నారు.
నాభర్త నేను కలసి పిల్లలను సరైన సక్రమ మార్గంలో పెంచాలనే ఉద్దేశ్యంతోనే ఈనిర్ణయం తీసుకున్నామని అన్నారు. అంతేకాకుండా ఇంట్లో మేము ఎప్పుడైనా మాట్లాడుకునేటప్పుడు పిల్లలు ప్రక్కన ఉన్నారో లేదోనని కూడా ఒక్కసారి చెక్ చేసుకోనిమరి మాట్లాడడం జరుగుతుంది. ఇది మాత్రమే కాకుండా తన పెద్ద కూతురు లెని ఎప్పుడైనా తన స్నేహితులు వద్ద నుండి ఏదైనా కొత్త విషయాలు తెలుసుకున్నప్పుడు వాటి గురించి నన్ను అడగడం జరుగుతుంది. అటువంటి విషయాల్లో ఎప్పుడైనా తను చిన్న చిన్న పోరపాట్లు చేస్తుంటే వాటిని నేను దగ్గరుండి మరీ అలా పలకకూడదు ఇలా మాత్రమే వాటిని ఉచ్చరించాలని జాగ్రత్తగా అన్ని దగ్గరుండి మరీ నేర్పడం జరుగుతుందని అన్నారు. ఇది మాత్రమే కాకుండా ఎప్పుడైనా నాస్నేహితులు ఇంటికి వచ్చినప్పుడు వారితో ఎలా పద్దతిగా మసులు కోవాలో అన్ని మొదటి నుండి నేర్పిస్తున్నానని అన్నారు.


Click it and Unblock the Notifications











