twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గుర్రపు స్వారీ సినిమాలో తప్పక చేశా.. కానీ అదంటే ద్వేషం

    By Nageswara Rao
    |

    లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ స్టార్ హీరోయిన్ క్రిస్టినా స్టివార్ట్ నటించిన తాజా చిత్రం 'స్నో వైట్ అండ్ ద హాంట్స్ మ్యాన్' సినిమా గురించి ఇటీవల ఓ ప్రముఖ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్యూలో మాట్లాడుతూ ఈ సినిమాలో నేను స్నో వైట్ పాత్రను పోషించడం జరిగింది. ఈ పాత్ర దృష్ట్యా నేను గుర్రపు స్వారీ చేయాల్సి ఉంది. ఐతే ఈ సినిమాలో నేను చేసిన ఈ గుర్రపు స్వారీ సీన్లు చేయడం హేయమైన విధంగా అనిపించిందని చెప్పారు.

    ఈ సినిమాకు బ్రిటిష్ డైరెక్టర్ రూపర్ట్ సాండర్స్ దర్శకత్వం వహించగా.. క్రిస్టినా స్టివార్ట్‌తో పాటు ఈ సినిమాలో ఛార్లీ థెరాన్, క్రిస్ హోమ్స్ వర్త్, సామ్ క్లాఫిన్ లాంటి మహామహులు నటించారు. 22 సంవత్సరాల వయసు కలిగిన క్రిస్టినా స్టివార్ట్ ఈ చిత్రంలో గుర్రపు స్వారీ భాగం చెత్తగా ఉందని అన్నారు. గుర్రం మరియు రైడర్ మధ్య డైనమిక్ సరిగ్గా లేదని అన్నారు. ఐతే గుర్రం పరిగెత్తడాన్ని మాత్రం బాగా ఆస్వాదించానని అన్నారు.

    'స్నో వైట్ అండ్ ద హాంట్స్ మ్యాన్' సినిమా గుర్రపు సీన్లు అదిరిపోయాయని, గుర్రం సముద్రతీరంలో పరిగెత్తే సన్నివేశాలు అధ్బుతంగా వచ్చాయని.. ఈ సినిమా యూనిట్ అంతా ఆ సన్ని వేశాలను బాగా ఎంజాయ్ చేశామని అన్నారు. నా వరకైతే మాత్రం గుర్రపు స్వారీ కొంచెం ఇబ్బందికి గురి చేసిందని తెలిపారు. అంతక ముందు ట్విలైట్ సిరిస్‌లలో క్రిస్టినా స్టివార్ట్ బెల్లా స్వాన్ అనే పాత్రను పోషించారు.

    English summary
    
 Kristen Stewart says she hated doing the horse riding scenes in her latest movie “Snow White and the Huntsman” in which she plays the Snow White.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X