Don't Miss!
- Technology 200MP కెమెరాతో వచ్చే Honor 90 ఫోన్ పై భారీ ఆఫర్! తక్కువ ధరకే పొందండి
- News రాయలసీమ నెత్తిన పాలు పోసిన మోడీ
- Finance IT News: ఇది శిక్ష-శిక్షణా.. TCS టెక్కీల కన్నీళ్లు.. అన్నంతపని చేసేసిన టెక్ దిగ్గజం..
- Automobiles మండే వేసవిలో ట్రాఫిక్ పోలీసులకు చల్లచల్లని ఏసీ హెల్మెట్లు.. ఎక్కడో తెలుసా.??
- Travel Hanuman Jayanti 2024 : ఢిల్లీలోని ఈ పురాతన హనుమాన్ దేవాలయాలను చూడాల్సిందే..!
- Sports జైస్వాల్.. వాళ్లపై ఎందుకంత కక్ష?- సునీల్ గవాస్కర్
- Lifestyle Mango Tea: ఇకపై తొక్కేకదా అని పారేయకండి.. ఇలా టీ చేసుకుని తాగండి..శరీరంలో జరిగే అద్భుతాలు చూడండి..
గుర్రపు స్వారీ సినిమాలో తప్పక చేశా.. కానీ అదంటే ద్వేషం
లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ స్టార్ హీరోయిన్ క్రిస్టినా స్టివార్ట్ నటించిన తాజా చిత్రం 'స్నో వైట్ అండ్ ద హాంట్స్ మ్యాన్' సినిమా గురించి ఇటీవల ఓ ప్రముఖ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్యూలో మాట్లాడుతూ ఈ సినిమాలో నేను స్నో వైట్ పాత్రను పోషించడం జరిగింది. ఈ పాత్ర దృష్ట్యా నేను గుర్రపు స్వారీ చేయాల్సి ఉంది. ఐతే ఈ సినిమాలో నేను చేసిన ఈ గుర్రపు స్వారీ సీన్లు చేయడం హేయమైన విధంగా అనిపించిందని చెప్పారు.
ఈ సినిమాకు బ్రిటిష్ డైరెక్టర్ రూపర్ట్ సాండర్స్ దర్శకత్వం వహించగా.. క్రిస్టినా స్టివార్ట్తో పాటు ఈ సినిమాలో ఛార్లీ థెరాన్, క్రిస్ హోమ్స్ వర్త్, సామ్ క్లాఫిన్ లాంటి మహామహులు నటించారు. 22 సంవత్సరాల వయసు కలిగిన క్రిస్టినా స్టివార్ట్ ఈ చిత్రంలో గుర్రపు స్వారీ భాగం చెత్తగా ఉందని అన్నారు. గుర్రం మరియు రైడర్ మధ్య డైనమిక్ సరిగ్గా లేదని అన్నారు. ఐతే గుర్రం పరిగెత్తడాన్ని మాత్రం బాగా ఆస్వాదించానని అన్నారు.
'స్నో వైట్ అండ్ ద హాంట్స్ మ్యాన్' సినిమా గుర్రపు సీన్లు అదిరిపోయాయని, గుర్రం సముద్రతీరంలో పరిగెత్తే సన్నివేశాలు అధ్బుతంగా వచ్చాయని.. ఈ సినిమా యూనిట్ అంతా ఆ సన్ని వేశాలను బాగా ఎంజాయ్ చేశామని అన్నారు. నా వరకైతే మాత్రం గుర్రపు స్వారీ కొంచెం ఇబ్బందికి గురి చేసిందని తెలిపారు. అంతక ముందు ట్విలైట్ సిరిస్‌లలో క్రిస్టినా స్టివార్ట్ బెల్లా స్వాన్ అనే పాత్రను పోషించారు.