సరదాగా డేటింగ్ ఎప్పుడూ చేయలేదు..!!
హాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఛార్లెజ్ థెరాన్ ఇటీవల ఓ ప్రముఖ ఇంటర్యూలో నేను గత 20 సంవత్సరాల నుండి రిలేషన్‌షిప్స్‌లో ఉంటున్నాను. నేను ఏరోజు కూడా ఎవరితో సరదాగా డేటింగ్‌కి వెళ్లిన సందర్బాలు లేవని స్పష్టం చేశారు. 'స్నో వైట్ అండ్ ద హాంట్స్ మ్యాన్' స్టార్ హీరోయిన అయిన ఛార్లెజ్ థెరాన్ తన బాయ్ ప్రెండ్ 'స్టువార్ట్ టౌన్సెండ్' నుండి జనవరి 2010 నుండి విడిపోయారు. అంతక ముందు వీరిద్దరూ కలసి 9 సంవత్సరాలు కలిసి జీవించారు.
నా జీవితంలో 19 సంవత్సరాల నుండి నేను సింగిల్‌గా జీవించడం మొదలుపెట్టాను. అప్పటి నుండి కూడా నాతోటి వారితో సిరియస్ రిలేషన్ షిప్స్‌ని కొనసాగిస్తున్నానని అన్నారు. దాంతో నేను ఎవరైతో రిలేషన్ షిప్స్‌కి మంచి ప్రాముఖ్యతను ఇస్తారో వారిని నేను ఈజీగా పసిగట్టగలనని అన్నారు. ఇంకా చెప్పాలంటే నేను ఎవరితోనైనా డేటింగ్‌కి వెళుతున్నప్పుడు అసలు నాకు డేటింగ్ చేసినట్లే అనిపించదని అన్నారు. నా బాయ్ ప్రెండ్'స్టువార్ట్ టౌన్సెండ్'తో నేను చాలా సార్లు డేటింగ్ చేసినప్పటికి, శారీరకంగా డేటింగ్ చేసే అవకాశం రాలేదని తెలిపింది.


Click it and Unblock the Notifications











