twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తండ్రి లైంగిక వేధింపుల కేసు: మైఖేల్ జాక్సన్ కూతురు భయం అదేనా?

    |

    పాప్ సంగీత ప్రపంచ రారాజు మైఖేల్ జాక్సన్ మీద చిత్రీకరించిన వివాదాస్పద డాక్యుమెంటరీ 'లీవింగ్ నెవర్‌లాండ్'పై అభిమానులు, పలువురు సెలబ్రిటీలు తమ తమ అభిప్రాయాలు సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తున్నారు. తాజాగా ఈ డాక్యుమెంటరీ గురించి మైఖేల్ జాక్సన్ కూతురు పారిస్ జాక్సన్ స్పందించారు.

    ఈ డాక్యుమెంటరీలో మైఖేల్ జాన్సన్ చిన్న పిల్లలను లైంగికంగా వేధించాడనే విషయాలు ఫోకస్ చేస్తూ రూపొందించారు. ఈ నేపథ్యంలో ప్రముఖ మోడల్‌గా రాణిస్తున్న పారిస్ జాక్సన్ 'లీవింగ్ నెవర్‌లాండ్'పై ఎవరూ ఊహించని విధంగా స్పందించారు. మైఖేల్ జాక్సేన్ కూతురు మూవీ, బాలీవుడ్‌తో లింకు...

    నేను ఎలాంటి ప్రకటన చేయలేదు

    నేను ఎలాంటి ప్రకటన చేయలేదు

    ఇటీవల ఓ హాలీవుడ్ వెబ్ సైట్.... పిల్లల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో తన తండ్రి మైఖేల్ జాక్సన్ అమాయకుడు అని పారిస్ జాక్సన్ నమ్ముతున్నట్లు రాసింది. దీనిపై ఆమె రియాక్ట్ అవుతూ ‘లివింగ్ నెవర్‌ల్యాండ్' డాక్యుమెంటరీపై తాను ఎలాంటి అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వలేదని స్పష్టం చేశారు.

    నా పని మీద ప్రభావం చూపుతుంది

    నా పని మీద ప్రభావం చూపుతుంది

    ఇప్పటి వరకైతే నేను ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఒక వేళ ఇస్తే ఇది నా వర్క్ లైఫ్ మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలియదు.. అని పారిస్ జాక్సన్ వ్యాఖ్యానించారు.

    మైఖేల్ జాక్సన్ మీద ఆరోపణలు

    మైఖేల్ జాక్సన్ మీద ఆరోపణలు

    తన ఫ్యామిలీ ఫ్రెండ్‌ కుటుంబానికి చెందిన పిల్లాడిని లైంగికంగా వేధించినట్లు 1993లో మైఖేల్ జాక్సన్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీనిపై ఓపెన్ ఇన్వెస్టిగేషన్ జరిగింది. అయితే 1994లో దీన్ని కోర్టు బయట సెటిల్ చేసుకున్నారు. 2005లో మరోసారి ఆయనపై ఈ ఆరోపణలు వచ్చాయి.

    డాక్యుమెంటరీలో ఏం చూపించారు

    డాక్యుమెంటరీలో ఏం చూపించారు

    ఇటీవల విడుదలైన ‘లీవింగ్ నెవర్‌ల్యాండ్' డాక్యుమెంటరీలో... ‘‘తాము చిన్నతనంలో ఉన్నపుడు మైఖేల్ జాక్సన్ లైంగిక వేధింపులకు వేధింపులకు పాల్పడ్డాడు అని ఆరోపణలు చేసిన వెడ్ రాబ్సన్, జేమ్స్ సెఫుచుక్ అనే ఇద్దరు వ్యక్తులను ప్రధానంగా ఫోకస్ చేశారు. రాబ్సన్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఇంటర్వ్యూలు, పాప్ రారాజుతో తమ రిలేషన్ గురించి వెల్లడిస్తూ ఈ డాక్యుమెంటరీ సాగింది.

    పాటల బహిష్కరణ, విగ్రహం తొలగింపు

    పాటల బహిష్కరణ, విగ్రహం తొలగింపు

    ఈ డాక్యుమెంటరీ రిలీజ్ సందర్భంగా అమెరికాలోని పలు రేడియో స్టేషన్స్ మైఖేల్ జాక్సన్ పాటలను ప్రసారం చేయడం బాయ్‌కాట్ చేసినట్లు తెలుస్తోంది. మరో వైపు మాంచెస్టర్ ఫుడ్‌బాల్ క్లబ్‌లో ఉన్న అతడి విగ్రహాన్ని కూడా తొలగించారు.

    English summary
    A nes websote recently claimed that Paris Jackson believes that her father Michael Jackson is innocent of sex abuse claims. For this, 20-year-old Paris clarified that as of now, she has not made any official statements in regards to all the allegations that are brought in light from Leaving Neverland documentary. "I actually haven't made any statements yet, especially regarding how it affects my work life," Paris tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X