సెక్సీ సీన్లు చేయాలంటే మందు వేయాల్సిందే..!
బెండ్ ఇట్ లైక్ బెకహాం, ఫైరేట్స్ ఆఫ్ ద కరేబియన్ సినిమాల ద్వారా ఫ్యామిలీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న కైరా నైట్లీ కొత్తగా నటించిన 'డేంజరస్ మెధడ్' సినిమాలో పాత్రకు అభిమానులు ఖంగుతిన్నారు. 'డేంజరస్ మెధడ్' సినిమాలో కైరా నైట్లీ సెక్స్ - ఆహారం కోసం పరితపించిపోయే మానసిక రోగి పాత్రను పోషించింది. ఈ సినిమాలో నటించిన కీలకమైన సెక్స్ సీన్లలలో తాను ఆల్కహాల్ సేవించడం జరిగిందని ఇటీవల ఓ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపింది.
ఇక వివరాల్లోకి వెళితే 26 సంవత్సరాలు వయసు కలిగిన కైరా నైట్లీ షూటింగ్‌కి ముందు వోడ్కా తీసుకోవడం, సీన్స్ అన్ని బాగా వచ్చిన తర్వాత తాను ప్రవర్తించే తీరు తనకే ఆశ్యర్యాన్ని కలగజేసిందని అన్నారు. కల్చర్ మ్యాగజైన్‌తో కైరా నైట్లీ మాట్లాడుతూ ఈ సినిమాలో రెండు షాట్స్‌ని వోడ్కా సేవించి నటించానని అన్నారు. ఇలా చేయడానికి కారణం కొన్ని సీన్స్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బందికి గురి కావడమేనని అన్నారు.
ఆల్కహాల్ విషయానికి వస్తే వోడ్కా తో పాటు ఛాంపెన్ కలిపి త్రాగడం నాకెంతో నచ్చిందన్నారు. ఈ రెండింటిని కలపి త్రాగితే అంత మత్తుగా ఉంటుందని అనుకోలేదని అన్నారు. ఈ సినిమాకి దర్శకత్వం డేవిడ్ వహించారు. స్టోరీ విషయానికి వస్తే మానసిక విశ్లేషకులు కార్ల్ జంగ్ మరియు సిగ్మండ్ ఫ్రాయిడ్ మద్య దాగి ఉన్న బంధాన్ని అందంగా తీర్చి దిద్దారు దర్శకుడు. కైరా నైట్లీ ఈ సినిమాలో సబిన స్పైల్రన్ పాత్రను పోషించారు. మానసిక రోగిగా కార్ల్ జుంగ్ మానసిక వైద్యశాలలో చికిత్స్ కోసం చేరుతుంది. ఈ సినిమాని 1993లో జాన్ కెర్ రచించిన 'మోస్ట్ డేంజరస్ మెధడ్' అనే పుస్తకం ఆధారంగా రూపొందించారు.


Click it and Unblock the Notifications











