»   » సెక్స్ గురించి అవగాహన వుంది అందుకే...?

సెక్స్ గురించి అవగాహన వుంది అందుకే...?

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెల్సియా హాండ్లర్ ఈమె హాలీవుడ్ కామెడీ హీరోయిన్. ఈమె గురించి మనం యిప్పుడు చాలా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈమె కామెడీ హీరోయిన్నే కాదు మంచి పుస్తక రచయిత కూడా. తను రాసిన మూడు పుస్తకాలు హాలీవుడ్ లో లక్షల్లో అమ్ముడు పోయాయి. అలాగే హాలీవుడ్ మ్యాగజైన్ 'నౌవ్'లో ఈ అమ్మడుకి సపరేటు కాలమే వుంది. ఈ కాలమ్ లో అమ్మడు మందు బాబులకు నచ్చే ఆల్కహాల్ గురించే జోక్స్ రాస్తుంది. ఈ అమ్మడు రాసిన పుస్తకాల్లో తన గురించి తాను ఎక్కువగా రాసుకుంటుంది. ముఖ్యంగా ఈ అమ్మడి తాగుడు విషయాలు, తన సెక్స్ విషయాలు గురించి ఒక పుస్తకమే రాసిందండోయ్.

ఈ పుస్తకం పేరు'ఆర్ యు దేర్ వాట్కా? ఇట్స్ మి చెల్సియా'. ఈ పుస్తకం న్యూయార్క్ టైమ్స్ లో మంచి పుస్తకంగా నమోదు అయింది. ఈ పుస్తకంలో తను శృంగారంలో పోల్గోన్నప్పుడు పోందిన అనుభూతులను, క్షున్నంగా వివరించింది. అలాగే తను తాగితే ఎలాగ ప్రవర్తిస్తుందో కూడా రాసింది. అలాగే తనకున్న బలాలు, బలహీనతలను ఈ పుస్తకంలో వివరించింది. పుస్తకం చదివితే తను చాలా ఆనందానికి లోనయినట్లు ఈ అమ్మడు యమ్ టివి అవార్స్ కార్యక్రమంలో చెప్పింది. ఇలా పుస్తకాలు రాసిన వాళ్లలో చెల్సియా హాండ్లర్ ప్రపంచంలో రెండవ స్రీ గా గుర్తింపు పొందారు.

చెల్సియా హాండ్లర్ ఎలా సెక్స్ లో పోల్గోనేదో తెలుసుకోవాలంటే మనం ఈ పుస్తకం చదవాల్సిందే..

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu