నాకు చదువు అంటే ప్రాణం అందుకే...?
బోస్నియా యుద్ధం జరిగి దాదాపుగా 15 సంవత్సరాలు కావస్తుంది. ఇటీవల కాలంలో ఏంజలీనా జోలీ బోస్నియా జరిగిన చోటుకి వెళ్శారు. బోస్నియా యుద్ధంలో దారుణంగా నష్టపోయి దాదాపు 15 ఏళ్లుగా సొంత ఊరికి..ఉన్న ఆస్తులకు దూరమై దుర్భరమైన జీవితాలను అనుభవిస్తున్న అక్కడి నిరాశ్రయులు తమ జీవితం ఏ గమ్యం చేరుతుందో తెలియకపోయినా వారి పిల్లల భవిష్యత్తు కోసం పడుతున్న కష్టాలను, వారి తెగువను చూసి ఆమె చలించిపోయారు. ఐక్యరాజ్యసమితి గుడ్ విల్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ ప్రపంచంలోని అనేక నిరాశ్రయులకు చేయూతను అందిస్తున్న జోలీకి ఆమె భర్త బ్రాడ్ పిట్ ప్రతిఅడుగులోనూ తోడు వుంటూ ఆదర్శజంట అని అనిపించుకుంటున్నారు.
హాలీవుడ్ అందమైన జంట ఏంజలీనా జోలీ, బ్రాడ్ పిట్ తమ మనసులు కూడా చాలా అందమైనవని ఎన్నో సార్లు చాటుకున్నారు. ఏంజలీనా జోలీ మరియు బోస్నియా త్రి మెంబర్ ప్రిసిడెన్సి ఛైర్మన్ హారిస్ సిలాజ్ద్ జిక్ వీరిద్దరూ కలసి కూలంకుషంగా చర్చించి, మొట్టమొదటి ప్రాముఖ్యత 'చదువు'కి ఇవ్వాల్సిందిగా ఆమె కోరారని తన సపోర్టు ఎప్పటికీ బోస్నియా ప్రజలకు వుంటుందని ఆమె చెప్పారు. అలాగే రాబోయే సినిమాలను ఇక్కడే తీసి మీకు కోంత వరకు సాయం చేయడానికి తాను రెడీగా వున్నానని ఆమె అన్నారని, హారిస్ సిలాజ్ద్ జిక్ వివరించారు.


Click it and Unblock the Notifications











