ఆస్కార్ అవార్డులలో బేబి బంప్ చూపించడానికి సిద్దమవుతున్న హీరోయిన్
ద డెవిల్ వేర్స్ ఫ్రాడా అనే సినిమాలో తన నటనా విశ్వరూపాన్ని ప్రదర్శించినటువంటి స్టార్ హీరోయిన్ అన్నే హాత్వే. తన పార్టనర్ మరియు బాయ్ ప్రెండ్ అయినటువంటి ఆడమ్ షుల్మన్‌తో గత రెండు సంవత్సరాలుగా డేటింగ్ చేస్తున్నటువంటి అన్నేహాత్వే త్వరలో తన ఫ్యామిలీని అభివృధ్ది చేసుకోవడానికి సన్నాహాలు చేస్తుంది. దీని అర్దం ఏమిటంటే త్వరలో తాను తల్లి కాబోతుందన్నమాట. ఈసందర్బంలో అన్నేహాత్వే మాట్లాడుతూ ప్రస్తుతం నేను పిల్లలు కనడానికి నాకు పెద్ద ఆశక్తి లేదు. కానీ స్త్రీ జీవితంలో ఓ అందమైన దశ ఏమిటంటే తను బిడ్డకు తల్లి అయినప్పుడే అని చాలా మంది పెద్దవారు అనడం విన్నాం..అందులో భాగంగానే నాకడుపులో పెరగుతున్నటువంటి బిడ్డ ఎప్పుడెప్పుడు బయటకు వస్తాడా అని ఎదురు చూస్తున్నాను అని అన్నారు.
ఇటీవల జరిగనటువంటి గోల్డెన్ గ్లోబ్స్ అవార్డుల కార్యక్రమంలో బ్లాక్ స్వాన్ సినిమా హీరోయిన్ నటాలీ పోర్ట్‌మెన్, 30 రాక్ సినిమా హీరోయిన్ జానే క్రాకోవాస్కీ, ఇన్‌సెప్సన్ సినిమా హీరోయిన్ మారిన్ కోటిల్లార్డ్ వారి యొక్క బేబి బంప్‌లను రెడ్ కార్పెట్ మీద చాలా హూందాగా చూపించినటువంటి విధానం అందరిని బాగా ఆకట్టుకుంది. ఇదే విధానాన్ని అన్నే హాత్వే కూడా త్వరలో జరగనున్నటువంటి ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో తనదైన శైలిలో తన బేబి బంప్‌ను చూపించడం కోసమే ఊవిళ్శుఊరుతుందని సినీ విశ్లేషకలు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











